నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చనున్న భోగి!
విభిన్నమైన కథలతో ఆడియన్స్ ను అలరించే శర్వానంద్(Sharwanand) మొదటిసారి పూర్తిస్థాయి మాస్ అవతారంలో నటించిన సినిమా భోగి(Bhogi). సంపత్ నంది(sampath nandi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగులుస్తోంది. భారీ అంచనాల మధ్య శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు అమెరికా ప్రీమియర్స్ నుంచే నెగిటివ్ రెస్పాన్స్ ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు నమోదు కాకపోవడం మేకర్స్ ను కలవరపెడుతోంది.
నిర్మాణ దశలోనే అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమాకు దాదాపు రూ.55 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. పలుమార్లు షూటింగ్ కు ఆటంకాలు ఎదురైనప్పటికీ నిర్మాత కేకే రాధామోహన్(KK Radhamohan) ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీపడకుండా సినిమాను పూర్తి చేశారు. అమెజాన్ ప్రైమ్(Amazon prime) డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోగా, ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ పెట్టుబడిలో సగానికి పైగా నష్టపోయే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అడ్వాన్స్ ప్రాతిపదికన సినిమాను రిలీజ్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నిర్మాతకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. శర్వానంద్‌ను మాస్ హీరోగా నిలబెట్టాలన్న సంపత్ నంది ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కలెక్షన్లలో అనూహ్యమైన మార్పు చోటుచేసుకోకపోతే 2026లో టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల్లో భోగి ఒకటిగా నిలిచే ప్రమాదముంది.







