బాలుకు ఆత్మస్థైర్యం ఎక్కువ! త్వరలో వచ్చేస్తాడన్న దర్శకుడు భారతీ రాజా
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఈరోజు క్షీణించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో ఆయన అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో గెట్ వెల్ సూన్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు బాలు స్నేహితుడు భారతీరాజా స్పందించారు. తన ప్రాణ స్నేహితుడు బాలుకు ఆత్మస్థైర్యం ఎక్కువన్న ఆయన, బాలు పట్టుదల కృషి ఎంతో బలమైనవని, బాలు కొలిచే దేవుళ్లు, నేను పూజించే దైవాలు బాలును ఆరోగ్యవంతంగా మాకు అందిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. త్వరలో మా బాలు మా వద్దకు వస్తాడని ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు.













