అనిల్లోని అసలైన మాస్ డైరెక్టర్ బయటికొచ్చాడు
టాలీవుడ్ లో టాప్ లీగ్ డైరెక్టర్ల లిస్ట్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఏ డైరెక్టర్ అయినా సరే ఈ లీగ్ లో అడుగుపెట్టాలనే ఇండస్ట్రీలోకి వస్తాడు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ ఈ లీగ్ లో ఉండగా, కొరటాల శివ చాలా తక్కువ టైమ్ లోనే ఇందులో ఎంటర్ అయ్యాడు. సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా తర్వాత ఈ లీగ్ నుంచి తప్పుకునే సిట్యుయేషన్ కనిపిస్తోంది.
ఎప్పట్నుంచో ఈ లీగ్ లోకి రావాలని ట్రై చేస్తున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో అనిల్ ఈ లీగ్ లోకి వస్తాడనుకున్నారంతా కానీ ఆ సినిమా రిజల్ట్ తర్వాత అనిల్, స్టార్ హీరో అయిన మహేష్ ను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడనే మాటలు బాగా వినిపించాయి. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి బాలయ్యతో చేస్తున్న భగవంత్ కేసరి సినిమాతో ఈ టాప్ లీగ్ లో చేరిపోవడం ఖాయమేనే అనిపిస్తుంది.
ఇప్పటి వరకు అనిల్ అంటే కామెడీ డైరెక్టరే అనుకున్నారంతా కానీ భగవంత్ కేసరి టీజర్ చూశాక తన అసలైన మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించాడు అనిల్. టీజర్ సూపర్బ్ గా ఉండటమే కాకుండా బాలయ్య ను ది బెస్ట్ అండ్ ఊర మాస్ గా చూపించి అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుని, సినిమాపై హైప్ ను పెంచాడు.
అసలే అఖండ, వీర సింహారెడ్డి సినిమాల సక్సెస్‌తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య ఫ్యాన్స్, భగవంత్ కేసరి టీజర్ చూశాక మామూలు ఊపులో లేరు. మంచి ఫామ్ లో ఉన్న బాలయ్యకు కావాల్సిన సరైన మాస్ మూవీ భగవంత్ కేసరి అయ్యేలా ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమే. మొత్తానికి ఈ దసరాకు అనిల్, బాలయ్య ఫ్యాన్స్‌కు మాస్ మీల్స్ బాగానే వడ్డించేట్లున్నాడు.













