బాలీవుడ్ సినిమాకు స్పూర్తిగా భగవంత్ కేసరి
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి. వీరిద్దరి కాంబోలో సినిమా అని అనౌన్స్ చేయగానే సినిమాకు భారీ హైప్ ఏర్పడగా, టీజర్ తో ఈ సినిమా అంచనాలు మరింత పెంచేసింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్లో 108వ సినిమాగా తెరకెక్కుతుంది.
దసరా కానుకగా రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమా గురించి ఇప్పుడొక వార్త వినిపిస్తుంది. ఈ సినిమా ఓ బాలీవుడ్ మూవీకి స్పూర్తిగా తెరకెక్కుతుందని నెట్టింట టాక్ వచ్చింది. బాలీవుడ్ లో 1992లో వచ్చిన ఖుదా గవా సినిమాకు, భగవంత్ కేసరికి చాలా దగ్గర పోలికలున్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఖుదా గవా సినిమాలో నాగార్జున కూడా నటించాడు. శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రేయసికి ఇచ్చిన మాట కోసం శతృవుని చంపుతాడు అమితాబ్. తన కూతురు ఇతనెవరో తెలియకుండా మరోచోట పెరిగి పెద్దదవుతుంది. కాబట్టి ఈ కథకు, బాలయ్య భగవంత్ కేసరికి దగ్గరి పోలికలున్నాయని తెలుస్తోంది.
ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే భగవంత్ కేసరి రిలజయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల బాలయ్యకు కూతురిగా కనిపించనుందని ఇప్పటికే ప్రచారమైంది. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఎంతో ఆశగా ఉన్నాడు.













