బాలయ్య తర్వాతి సినిమా ఎవరితో?
అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే నందమూరి బాలకృష్ణ ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అఖండ సినిమా చేస్తున్నప్పుడే వీరసింహా రెడ్డి సినిమాను ఓకే చేశాడు. వీరసింహా రెడ్డి సెట్స్ పై ఉండగానే అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాను లైన్ లో పెట్టాడు.
ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లోనే తన తర్వాతి సినిమా కోసం డిస్కషన్స్ చేస్తున్నాడు బాలయ్య. ఎప్పుడైనా సరే బాలయ్య బర్త్ డే కు తను నటిస్తున్న సినిమా తాలూకు అప్డేట్స్ తో పాటూ, తన తర్వాతి సినిమాల అనౌన్స్మెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. గతేడాది అనిల్ సినిమాను బాలయ్య బర్త్ డే రోజునే అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ సారి బాలయ్య బర్త్ డే కు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాకు సంబంధించిన వీడియో గ్లింప్స్ తో పాటూ టైటిల్‌ను కూడా రివీల్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటూ బాలయ్య కొత్త సినిమా ప్రకటన కూడా జూన్ 10నే రానుందట. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు? నిర్మాత ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
వాస్తవానికి అనిల్ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి తో కలిసి అఖండకు సీక్వెల్ చేస్తారనుకున్నారు. అఖండ సంచలన విజయం తర్వాత ఈ విషయాన్ని బాలయ్య, బోయపాటి ఇద్దరూ కూడా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. కాకపోతే ఇప్పుడు బాలయ్య కోసం బోయపాటి వెంటనే స్క్రిప్ట్ రెడీ చేయలేడు. ఇప్పటికే రామ్ సినిమాతో బిజీగా ఉన్న బోయపాటి, ఆ సినిమా పూర్తయ్యాకే బాలయ్యకు టైమ్ కేటాయించగలడు. కాబట్టి ఈ లోపు బాలయ్య వేరే డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. రీసెంట్గా వచ్చిన వార్తలను బట్టి ఒకవేళ బాలయ్య, పూరీతో కాకా సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.













