వాలెంటైన్స్ డే…ఆ తీపి కబురు చెప్పేశారు
కోలీవుడ్లో గత కొంతకాలంగా హీరో అర్య, హీరోయిన్ సాయేషా సైగల్ మధ్య అఫైర్ నడుస్తోందటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చివరికి ఆర్య, సాయేషా తమ ప్రేమ విషయాన్ని చెప్పేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ ఈ తీపి కబురు చెప్పారు. తమ పెళ్లి విషయాన్ని కూడా వారు ప్రకటించారు. ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితో మార్చిలో తాము పెళ్లి చేసుకోబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఆర్య, సాయేషా. అయితే పెళ్లి తర్వాత సాయేషా సినిమాల్లో నటిస్తుందా? అనేది సస్పెన్స్. తెలుగులో ఒక్క సినిమాతోనే మాయమైపోయిన ఈ బ్యూటీ తమిళంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇలాంటి తరుణంలో ఆమె పెళ్లి చేసుకొని సెటిలైపోతుందని చెప్పలేము. ఇక వయసులో ఆర్య కంటే సాయేషా 17 ఏళ్ల చిన్నది కావడం వివేషం. ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ జంట మరోసారి నిరూపించింది.













