ది ప్యారడైజ్ కు ఆ టైటిల్ అయితే సరిగ్గా సరిపోయేదట!
నాని(nani), శ్రీకాంత్ ఓదెల(srikanth odela) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(the paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, డ్రామా కలయికకు డైరెక్టర్ పెద్దపీట వేసినట్లు ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌తో స్పష్టమవుతోంది. దసరా తర్వాత ఈ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగానే సినిమా కూడా భారీ స్థాయిలో రూపొందుతోంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా నాని క్యారెక్టర్, విలన్ రాఘవ్ జుయల్(raghav juyal), శ్రీకాంత్ ఓదెల టేకింగ్ చుట్టూనే డిస్కషన్ జరిగినా.. ఇప్పుడు కథలోని మరో కీలకమైన పాత్ర ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో సొనాలి కులకర్ణి(Sonali kalakarni) నాని తల్లి పాత్రలో కనిపించనున్నారు. సాధారణంగా హీరో తల్లి పాత్రలు కథలో ఎమోషన్ ను పెంచే స్థాయిలోనే ఉంటాయి. కానీ ది ప్యారడైజ్ విషయంలో ఈ క్యారెక్టర్ కు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు నాని చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి. సినిమా మొత్తానికి ఈ క్యారెక్టర్ ఎమోషనల్ యాంకర్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అందుకే నాని స్వయంగా ఈ క్యారెక్టర్ ను సినిమాకు ప్రత్యేకమైన బలంగా పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ పాత్రకు సమ్మక్క(sammakka) అనే పేరు టైటిల్‌గా పెట్టినా సరిపోయేదని నాని చెప్పడం మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. దీంతో ది ప్యారడైజ్ లో తల్లి పాత్ర కేవలం నాని పాత్రకు సంబంధించిన బ్యాక్‌స్టోరీ మాత్రమేనా, లేక కథను నడిపించే మెయిన్ పవర్ గా ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 24న సినిమా రిలీజైన తర్వాత ఈ పాత్రకు ఉన్న అసలు ప్రాధాన్యత ఏమిటో తేలనుంది. అనిరుధ్(anirudh) మ్యూజిక్, భారీ నిర్మాణ విలువలతో పాటు సొనాలి కులకర్ణి క్యారెక్టర్ కూడా సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారే అవకాశముంది.








