తెలుగు చలనచిత్ర ‘నంది’ పోటీ మహోత్సవం!
క్షత్రియదుందుభి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చలనచిత్రాలకు ‘నందిబహుమతులు’ మహోత్సవాలను తిరిగి ప్రారంభించింది. ఈ పోటీల ‘న్యాయనిర్ణేతల కమిటీ’ లో మిగిలిన కమిటీతో బాటు తొలివరుసలోనే.. సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నడింపల్లి సీతారామరాజు గారిని నియమించి గౌరవించింది. దీనిపట్ల క్షత్రియసమాజం వారికి అభినందనల తెలుపుతూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
ఎపి సాంస్కృతికశాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నూతనంగా నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక సినీమా – నాటక నందిబహుమతుల పోటీలకు సంబంధించి వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ, జీవో విడుదల చేసింది. ఇందులో సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నడింపల్లి సీతారామరాజు గారికి చోటు కల్పించడం సంతోషదాయకం.
ఉదయం పత్రిక అనధికారిక సారథి వంటి ఎన్నో అక్షరోత్సవాలకు వారధిగా.. సారధిగా సుదీర్ఘ జర్నలిజానుభవం, సమాజం పట్ల అవగాహన, నైతికత, కళా సాంస్కృతిక రంగాలపై పరిపూర్ణ పరిశీలన, సృజన.. సృజనాత్మకతను గుర్తించే సూక్ష్మదృష్టి వంటి లక్షణాలు న్యాయనిర్ణేత బాధ్యతలకు ఎంతో ఉపయుక్తం కాగలవు.
ఇవి కూడా చదవండి
కళారంగం అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదు. అది సమాజానికి అద్దం పట్టే ఉన్నత కళారూపం కావాలి. అటువంటి రంగంలో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి, ప్రోత్సహించి, సినీమా, నాటక రంగానికి మరింత గౌరవాన్ని తీసుకురావడంలో నంది పోటీలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని ఎన్నిక చేయటంలో ఇటువంటి మహనీయుల సమధృష్టి కళలపై గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక బాధ్యతను వీరికి అప్పగించిన ప్రభుత్వం సముచితంగా వ్యవహరించిందని భావిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ..
స్వీకరించిన శ్రీ నడింపల్లి సీతారామరాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వారి న్యాయనిర్ణేత బాధ్యతలు విజయవంతంగా సాగాలని, మరెన్నో మంచి కళాత్మక ప్రయోగాలకు వీరి ప్రతిభ దోహదపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
సినీకళకు గౌరవం… నాటక కళాకారులకు ప్రోత్సాహం…
నాటక రంగానికి
నూతన వైభవం కలగాలని ఆశిస్తూ..
ఇట్లు
-చిలువూరి రామకృష్ణరాజు
(క్షత్రియదుందుభి మాసపత్రిక)







