అమృత వర్షిణి ప్రారంభం
నందమూరి తారకరత్న, మేఘ శ్రీ జంటగా నటిస్తున్న చిత్రం అమృత వర్షిణి. శివ ప్రభు దర్శకుడు. నాగరాజు నెక్కంటి దర్శకుడు. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నారా రోహిత్ క్లాప్‌నిచ్చారు. శ్రీకాంత్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తారకరత్న మాట్లాడుతూ భావోద్వేగ ప్రధానంగా సాగే చిత్రమిది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నాం. మంచి బృందం కుదిరిందన్నారు. యువతకే కాదు, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే చిత్రమిది. అన్ని రకాల అంశాలూ ఉన్నాయి. చిక్ మంగళూరులో షూటింగ్ జరగనుంది. ఒక్క షెడ్యూల్‌తోనే సినిమా పూర్తిచేస్తామన్నారు. సంగీతం: జెస్సీ గిఫ్ట్.













