మోదీ భీమవరం పర్యటనలో ప్రధాన ఆకర్షణగా అంబికా కృష్ణ కు గుర్తింపు!
ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్త, నిర్మాత అంబికా కృష్ణ మూడేళ్ళ క్రితం తెలుగు దేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే! అగ్ర నిర్మాతగానే కాకుండా, టీడీపీ ప్రభుత్వ హయాంలో సినిమా రంగం తరపున ఏపీ ఎఫ్.డి.సీ. చైర్మన్ గానూ సేవలు అందించిన అంబికా కృష్ణ ను జాతీయ పార్టీ బిజెపి చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు పట్ల ఆకర్షితుడై ఆ పార్టీ లో చేరారు. పశ్చిమ గోదావరి జల్లాలో ఆయనకున్న ప్రజాకర్షణ ఎలాంటిదో ఇటీవల ప్రధాని మోదీ భీమవరం పర్యటించిన సమయంలో అది నిజమేనని రుజువైంది. ఆజాదీ కా అమృత మహోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ వేడుకకు హైదరాబాద్ నుండి చిరంజీవి సైతం హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో అంబికా కృష్ణకూ విశేష ప్రాధాన్యం లభించింది.
ప్రధాని మోదీ భీమవరంలో హెలికాఫ్టర్ దిగినప్పుడు కేవలం 8మందిని మాత్రమే హెలిప్యాడ్ కు అనుమతినిచ్చారు పి ఎం సెక్యూరిటీ డిపార్ట్మెంట్. అయితే వారిలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు అంబికా కృష్ణ కూడా ఉన్నారు. మోదీని హెలిప్యాడ్ వద్ద ఆహ్వానించిన అంబికా కృష్ణకు రాబోయే రోజుల్లో ఆ పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. గతంలో ఏలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన అంబికా కృష్ణ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మోదీ పర్యటన సందర్భంగా అంబికా కృష్ణ ఈ వేడుకకు ఆకర్షణ నిలవడం ఆయనకున్న నిబద్ధత, మంచితనమే అని స్థానికులు అనుకుంటున్నారు.













