బాలయ్య సరసన అమలాపాల్!
గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం తర్వాత నందమూరి బాలకృష్ణ పూరీ జగన్నాథ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశముందట. ఇప్పటికే ఓ పాత్ర కోసం ముస్కాన్‌ని తీసుకున్నారు. మరో నాయికగా కాస్త పాపులారిటీ ఉన్న హీరోయిన్ను తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ పాత్ర మలయాల కుట్టి అమలాపాల్‌కు దక్కినట్లు సమాచారం. దర్శకుడు విజయ్ నుంచి విడాకులు తీసుకున్న అమల కెరీర్‌పై పూర్తి శద్ధ్ర పెట్టింది. ఇప్పుడు తెలుగులో కూడా హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ, బాలయ్య కాంబినేషన్లో సినిమాకు ఎంపికైనట్లు సమాచారం. పూరీతో ఇంతకుముందు ఇద్దరమ్మాయిలతో సినిమా చేసిన అమల, బాలయ్యతో జతకట్టడం మాత్రం ఇదే మొదటిసారి.







