శ్రీవారి సేవలో ‘అలవైకుంఠపురంలో’ చిత్రబృందం
తిరుమల శ్రీవారిని అలువైకుంఠపురంలో చిత్రబృందం శుక్రవారం శ్రీవారికి నిర్వహించే నిజపాద దర్శనంలో దర్శించుకున్నారు. వీరిలో చిత్ర నటుడు అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు ఉన్నారు. చిత్ర విజయవంతం కావడంతో చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించు కొన్నారు. కాగా సినీనటుడు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.













