రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ నటుడి అవార్డును స్వీకరించిన అల్లు అర్జున్
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్ర ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ (పుష్ప ) అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డును అలియా భట్ (గంగుభాయి కాఠియావాడి), కృతిసనన్ (మిమి)లు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ఉప్పెన సినిమాకు బుచ్చిబాబు అవార్డు అందుకున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి ఎల్. మురుగన్ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను విజేతలకు అందజేశారు.













