ఫ్యాన్స్ కు బన్నీ బర్త్ డే గిఫ్ట్ ఏంటంటే..!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ కు పండుగ అంటే ఏప్రిల్ 8. ఆ రోజు బన్నీ పుట్టినరోజు. మరి తన ఫ్యాన్స్ కు బర్త్ డే కానుకగా ఏం గిఫ్ట్ ఇస్తున్నాడనేది అందరూ ఆలోచిస్తున్న విషయం. తాజా సమాచారం ప్రకారం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప టీజర్ రిలీజ్ కానుందని ఆ టీజర్ మొత్తం బన్నీ మాస్ లుక్ తో రూత్ లెస్ కుర్రాడిగా ఊహించని షాకిస్తాడని తెలుస్తుంది.
పుష్పలో బన్నీ పాత్ర ఎలా ఉంటుందనే దానికి టీజర్ తోనే ఇంట్రో ఇవ్వనున్నారట. పోస్టర్ లో కొంత రివీల్ చేసినా టీజర్ మాత్రం కంప్లీట్ రేంజ్ లో ట్రీట్ ఇవ్వనుందట. రూత్ లెస్ గా పూర్తి ఈగోతో నిండిన ఓ లారీ డ్రైవర్ కమ్ స్మగ్లర్ గా బన్నీ కనిపించబోతున్నాడని సమాచారం.
స్మగ్లర్ ని వేటాడి పోలీసాఫీసర్ కు చుక్కలు చూపించేలా బన్నీ క్యారెక్టర్ ని సుకుమార్ డిజైన్ చేశారట. ఇంతకీ స్మగ్లర్ లో పాజిటివ్ యాంగిల్ ఉంటుందా ఉండదా అన్నది మాత్రం సినిమా రిలీజయ్యాకే తెలియనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప కు బాణీలు సమకూరుస్తున్నారు.













