తగ్గేదేలా డైలాగ్ వెనుక రహస్యం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరక్షన్ లో రష్మిక హీరోయిన్ గా చేస్తున్న చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రంలో బన్నీ మాస్ ధమాకా ట్రీట్ ఇవ్వనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్లకు సహకరించే లారీ డ్రైవర్ గా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో బన్నీ నటిస్తున్నారు.
ఇప్పటికే బన్నీ మాస్ లుక్ ని లాంఛ్ చేయగా, ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇక ఈ మూవీలో బన్నీ పదే పదే ఎక్కువగా వాడే డైలాగ్ ఒకటి ఇప్పుడు బయటికొచ్చింది. తగ్గేదేలే అంటూ.. మొన్న చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్ప అప్డేట్ ని అల్లు అర్జున్ చెప్పకనే చెప్పాడు. పుష్పలో అతడు పదే పదే చెప్పే డైలాగ్ ఇదే అని తెలుస్తుంది. ఇదే డైలాగ్ ని అన్ని భాషల్లోనూ చెప్పనున్నాడట బన్నీ. ఆ ఒక్క డైలాగ్ ను బన్నీ లీక్ చేసి మూవీ మీద హైప్ పెంచేశాడు. సుకుమార్ సినిమాలకు డైలాగ్స్ మొయిన్ ఎస్సెట్. ఇప్పుడు పుష్పలో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయనున్నాడని తెలుస్తుంది. బన్నీ మాస్ లుక్స్ తగ్గట్లే ఈ డైలాగ్స్ కూడా ఉండనున్నాయని, ఆగస్టు 13న రిలీజ్ కానున్న ఈ సినిమా క్రేజీ పాన్ ఇండియా సినిమాల కేటగిరీలో ఉంది.













