బన్నీ అభిమానులకు సర్ ప్రైజ్
అల్లు అర్జున్ మహాశివరాత్రి సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన 20వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. వీరిద్దరిదీ క్రేజీ కాంబినేషన్ బన్నీ, సుకుమార్ కలయికలో ఆర్య, ఆర్య 2 వంటి సూపర్‌హిట్ చిత్రాలొచ్చాయి. బన్నీ నటించిన ఐ యామ్ దట్ ఛేంజ్ అనే సోషల్ ఫార్ట్ ఫిలింకు సుకుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు హాట్రిక్ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుందనేది తెలియాల్సి ఉంది.













