ఆహా ఇండియన్ ఐడల్ 2 స్టేజ్ మీద టాప్ 10 కంటెస్టంట్లతో కలర్ఫుల్గా దసరా మేజిక్ చేసిన నాని
– కార్తికేయకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న నాని
– ఆహా ఇండియన్ ఐడల్ 2 తో శ్రుతి కలిపిన ఎస్పీ చరణ్
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద ఈ వారం స్పెషల్ గెస్ట్ గా మెరవనున్నారు నేచురల్ స్టార్ నాని. దసరా సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్లో దుమ్మురేపుతున్నారు నాని. అదే జోష్‌తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద చార్మింగ్‌గా కనిపించనున్నారు. ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ప్రసారమయ్యే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2 ఎపిసోడ్స్ చాలా ప్రత్యేకమైనవి. టాప్ 10 కంటెస్టంట్లు ఈ ఎపిసోడ్స్ తో మధురగాయకుడు, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎప్పీ చరణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. నేచురల్ స్టార్ పాల్గొంటున్న హై ఎనర్జీ ఎపిసోడ్స్ ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే నాని రీసెంట్ బ్లాక్ బస్టర్ దసరా సినిమాలోని చమ్కీల అంగీలేసీ పాటకు గళం కలిపటాన్ని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు. న్యాయ నిర్ణేతలు ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తిక్, ఎస్పీ చరణ్‌తో కలిసి నాని కూడా ఈ వేదిక మీద ఓ పాట పాడటం విశేషం.
ఎస్పీబాలసుబ్రహ్మణ్యం కెరీర్ బెస్ట్ సాంగ్స్ తో ఆయనకు నివాళులర్పించారు కంటెస్టెంట్స్. అంతే కాదు, ఈ వేదిక మీద సింగర్ కార్తికేయ నాని మనసు గెలిచారు. హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. నాని మాటలు విని 16 ఏళ్ల కార్తికేయ ఆనందానికి అవధుల్లేవు. జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఈ సందర్భంగా పలకరించడం ఆనందంగా ఉందని అన్నారు నాని. తన దసరా ప్యాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అయిన సందర్భంగా అందరితోనూ ఆ సంతోషాన్ని పంచుకోవడం హ్యాపీగా ఉందని చెప్పారు నేచురల్ స్టార్.
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2కి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో అభిమానులున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2. సంగీత ప్రపంచంలో ప్రముఖులైన హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ దడ్లానీ, జీవీ ప్రకాష్ తో పాటు ఎంతో మందిని తమ గళాలతో మెప్పిస్తున్నారు గాయనీ గాయకులు. అటు నేచురల్ స్టార్ నాని, ఇటు ఎస్పీ చరణ్ ముఖ్య అతిథులుగా ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ సంగీతాభిమానులకు పండగలా ఉంటుంది. ఈ శుక్ర, శనివారాల్లో, అంటే ఏప్రిల్ 7, 8న నానిని ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2లో చూడటం మర్చిపోవద్దు. పండగలాంటి వాతావరణాన్ని ఆస్వాదించడం మర్చిపోవద్దు.













