ఆర్.ఆర్.ఆర్ లో అదితిరావు ?
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ (వర్కింగ్ టైటిల్) సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొత్త వార్త ప్రచారంలో ఉంది. ఇందులో కథానాయికగా ఇప్పటికే అనేక మంది పేర్లు బయటికి వచ్చాయి. సమంత, కీర్తి సురేశ్, కియారా అడ్వాణీ పేర్లు చెప్పుకొచ్చాయి. అయితే తాజాగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ రాణిస్తున్న అదితిరావు హైదరిని ఈ సినిమా కోసం తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆమె నటన మెచ్చి దర్శకధీరుడు ఇందులోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించాలని యూనిట్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్.ఆర్.ఆర్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఇటీవల సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాలో ఈషా రెబ్బా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రామ రావణ రాజ్యం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.













