తెలుగు తెరకి మరో యాక్షన్ హీరో… నితిన్ నాష్
ప్రస్తుతం తెలుగు సినిమాల ద్వారా చాలా మంది కొత్త కుర్రాళ్ళు హీరోలుగా పరిచయం అవుతున్నారు. “బిచ్చగాడు” చిత్రం తో సంచలనం సృష్టించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పరిచయం చేస్తున్న యంగ్ డైనమిక్ హీరో నితిన్ నాష్. తెలుగు వాడైన ఈ హీరో ముంబై లో ఐదేళ్ల పాటు మార్షల్ ఆర్ట్స్ మరియు డాన్సుల తర్ఫీదు తో ఎంతో ప్రావీణ్యత సంపాదించటం విశేషం. అలాగే నటనలో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకోవటం మరో విశేషం.
నిర్మాతలు చదలవాడ తిరుపతి రావు ఆయన సోదరుడు చదలవాడ శ్రీనివాస రావు నిర్మించబోయే కొత్త చిత్రానికి ఎంతో మంది కొత్త కుర్రాళ్ళని పరిశీలించిన తరువాత నితిన్ నాష్ టాలెంట్ ని గుర్తించి తమ “రోజ్ గార్డెన్” చిత్రానికి హీరోగా పరిచయం చేయటం విశేషం. టెర్రరిస్ట్స్ బాక్ డ్రాప్ లో మ్యూజికల్ లవ్ స్టొరీ తో పూర్తిగా కాశ్మీర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన “రోజ్ గార్డెన్” చిత్రం ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో డాల్బీ మిక్సింగ్ పనుల్లో ఉంది.
హిందీ తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని సమ్మర్ లో ప్రత్యేకంగా విడుదల చేయటానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. జి రవి కుమార్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం లో నితిన్ నాష్ సరసన ఫెర్నాజ్ శెట్టి తో పాటు తమిళ నటుడు త్యాగ రాజన్ పోసాని కృష్ణ మురళి, ధనరాజ్, గౌతం రాజు, రజిత మరియు ముంబాయికి చెందిన మిలింద్ గుణాజీ, అశోక్ కుమార్ బెనివాల్, సునీల్ శర్మ, రెహా ఖాన్, గౌహర్ ఖాన్, జాని ఫీవర్ తో పాటు స్వీడన్ కి చెందిన బబ్రక్ అక్బరీ నటించటం జరిగింది.
రోజ్ గార్డెన్ చిత్రం లో హీరో పోరాట సన్నివేశాల్లో సాహసవంతముగా చేసిన ఫైట్స్ టాలెంట్ ని గుర్తించి భవిష్యత్తులో నితిన్ నాష్ భవిష్యత్తు లో పెద్ద యాక్షన్ హీరో గా రాణించగలడనే నమ్మకం తో బప్పిలాహిరి సంగీతం తో పూర్తిగా యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చదలవాడ బ్రదర్స్ ఇటీవలే ప్రకటించటం కూడా జరిగింది.
రోజ్ గార్డెన్ చిత్రం విడుదలకు ముందే హీరో గా మరిన్ని అవకాశాల్ని దక్కించుకుంటున్న నితిన్ నాష్ “డిఫరెంట్” అనే హాలీవుడ్ చిత్రం లో హీరో గా నటించటం మరో విశేషం.













