‘సైరాబాను’ మొదటి షెడ్యూల్ పూర్తి- సరదాగా సాగే BTS వీడియో రిలీజ్
శంబాల ఘనవిజయంతో మంచి జోష్‌లో ఉన్న హీరో ఆది సాయి కుమార్, ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్,కమర్షియల్ అంశాల కలయికతో రూపొందుతున్న మరో ఆసక్తికరమైన ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ‘కె-ర్యాంప్’ (K-Ramp) వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ‘సైరాబాను’. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ-నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. “A Fun Filled Journey of Love, Faith & Destiny’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో
బాంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు.
ఒక హిందూ యువకుడు, ముస్లిం యువతి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథను దర్శకుడు ఫణి కృష్ణ సిరికి ఇందులో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ , రాజమండ్రి నేపథ్యంలో సాగే ఈ చిత్రం మొదటి షూటింగ్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఆది సాయి కుమార్, బాంధవి శ్రీధర్, వెన్నెల కిషోర్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ సెట్లో వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించారు.
చిత్రం రూపుదిద్దుకుంటున్న తీరు పట్ల చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది, వారి ఉత్సాహం BTS (బిహైండ్-ది-సీన్స్) వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సెట్స్‌లో నెలకొన్న సరదా వాతావరణాన్ని, అందరి ముఖాల్లోని ఆనందం ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సినిమా ఎంత వినోదాత్మకంగా ఉండబోతోందో చెప్పడానికి ఈ వీడియోనే ఒక నిదర్శనం. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.
ఈ ప్రాజెక్ట్ అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.








