ఎమోషన్స్ తో నిండిన క్లాసిక్ లవ్ జర్నీ!
కిరణ్ అబ్బవరం(Kiran abbavaram), శ్రీ గౌరి ప్రియ(Sri Gauri Priya) జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ(Chennai love story) సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనౌన్స్మెంట్ నుంచే ఇది ఆడియన్స్ మనసులను తాకే క్లాసిక్ లవ్ స్టోరీ అవుతుందని రైటర్ సాయి రాజేష్(Sai Rajesh), నిర్మాత ఎస్కేఎన్(SKN), డైరెక్టర్ రవి నంబూరి(Ravi Namburi) చెబుతూ వచ్చారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ నమ్మకాన్ని మరింత బలపరిచింది. ప్రేమ, బాధ, ఆశ, జీవితాన్ని మరోసారి కొత్తగా ప్రారంభించే భావోద్వేగాలను హృద్యంగా చూపిస్తూ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జూలై 24న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ కథాంశం ప్రకారం, గత ప్రేమలో తీవ్రంగా గాయపడిన యువతి ఒంటరితనంలో జీవిస్తూ ఉంటుంది. అలాంటి టైమ్ లో డైరెక్టర్ గా ఎదగాలనే కలతో జీవించే యువకుడు ఆమె లైఫ్ లోకి వస్తాడు. అతని సానుకూల దృక్పథం, ప్రేమతో ఆమె జీవితంలో మళ్లీ వెలుగులు నింపే ప్రయత్నం చేస్తాడు. ఇద్దరి మధ్య పెరిగే అనుబంధం ప్రేమగా మారే క్రమంలో ఎదురయ్యే ఎమోషన్స్, సంఘర్షణలు, అనూహ్య మలుపులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కిరణ్ అబ్బవరం తన పాత్రలో సహజమైన నటనతో మెప్పించగా, శ్రీ గౌరి ప్రియ ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది.
టెక్నికల్ గా కూడా ట్రైలర్ మంచి స్థాయిలో కనిపిస్తోంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌కు మరింత ఎమోషన్ ను జోడించగా, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ చెన్నై నగర అందాలను సహజంగా తెరపై ఆవిష్కరించింది. రవి నంబూరి డైరెక్షన్, సాయి రాజేష్ రైటింగ్ కలిసి ప్రేమ, డ్రామా, మానవ సంబంధాలను సమతుల్యంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ స్పష్టంచేసింది.








