కల్కికి రిలీఫ్ ఇచ్చిన సలార్
అప్ కమింగ్ ఇండియన్ సినిమాల్లో మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ కల్కి 2898ఏడీ. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ఫాంటసీ టచ్‌ను ఇవ్వనున్నాడు. కల్కిలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కొన్నాళ్ల కిందట వచ్చిన కల్కి టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రీసెంట్ గా రిలీజైన సలార్ మంచి టాక్ తెచ్చుకోవడంతో అది కల్కికు ప్లస్ కానుంది. బహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపే కావడంతో సలార్ హిట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త ఊపిరిపోసింది. ఒకవేళ సలార్ కూడా తేడా కొడితే ఆ ఎఫెక్ట్ ప్రభాస్ మార్కెట్‌పై పడేది.
కానీ సలార్ వల్ల ప్రభాస్‌కు పూర్వ బాక్సాఫీస్ వైభవం వచ్చేసింది. డివైడ్ టాక్ తోనే సలార్ వారం లోపు రూ.500 కోట్ల కలెక్షన్స్ ను సాధించి, ప్రభాస్ సత్తా ఏంటో తెలిసేలా చేసింది. సలార్ కు మంచి టాక్ రావడం కల్కి సినిమా మేకర్స్ కు మంచి రిలీఫ్ ను ఇస్తుంది. సలార్‌కే ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ ను తెచ్చిన ప్రభాస్, కల్కి తో ఏ రేంజ్ ఓపెనింగ్స్‌ను సాధిస్తాడో చూడాలి.













