నేషనల్ అవార్డ్స్ 2026 విన్నర్స్ ఫుల్ లిస్ట్…
ఉత్తమ నటిగా యామి… నటుడిగా ఇద్దరికి అవార్డు… సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
72nd National Film Awards Winners List: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతల వివరాలను ఇవాళ ప్రకటించారు. 2024లో విడుదలైన సినిమాలకు అవార్డులు ఇచ్చారు. ఎవరెవరు విజేతలుగా నిలిచారో చూడండి.
ఉత్తమ నటిగా యామి గౌతమ్…
ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్!
‘ఆర్టికల్ 370’ చిత్రానికి గాను… కథానాయిక యామీ గౌతమ్ ఉత్తమ నటి పురస్కారం వరించింది. ‘భ్రమయుగం’ సినిమాకు గాను ఉత్తమ నటుడి పురస్కారం మలయాళ కథానాయకుడు మమ్ముట్టిని వరించింది. ఆయనతో పాటు హిందీ సినిమా ‘చందూ ఛాంపియన్’కు గాను బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా అవార్డు అందుకోనున్నారు. ‘బెస్ట్ యాక్టర్’ అవార్డును ఇద్దరు తీసుకోనున్నారు.
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ను ఉత్తమ సినిమా పురస్కారం వరించింది. ఆ సినిమాకు గాను ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ పురస్కారం అందుకోనున్నారు. అలాగే, ఆ సినిమాను తెరకెక్కించిన రాజ్ కుమార్ పెరియసామిని ‘ఉత్తమ దర్శకుడి’ పురస్కారం వరించింది. ఎడిటింగ్ విభాగంలోనూ ‘అమరన్’కు అవార్డు వచ్చింది. ఉత్తమ బాలల సినిమాగా ’35 ఒక చిన్న కథ కాదు’ నిలిచింది. ‘ఆర్టికల్ 370’ ఉత్తమ సినిమాగా నిలిచింది. ఆ సినిమాకు పాటలు అందించిన శాశ్వత్ సచ్దేవ్ ఉత్తమ స్వరకర్త (సంగీత దర్శకుడు – పాటలు)గా అవార్డు అందుకోనున్నారు.
ఉత్తమ సినిమా: ఆర్టికల్ 370 (ఆదిత్య సుహాస్ జంబాలే)
ఉత్తమ బాలల సినిమా: 35 ఒక చిన్న కథ కాదు
ఉత్తమ నటుడు (ఇద్దరికి): కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్), మమ్ముట్టి (భ్రమయుగం)
ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): శాశ్వత్ సచ్దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ కుమార్
ఉత్తమ ఎడిటర్: ఆర్ కలైవానన్ (అమరన్)
పాపులర్ సినిమాగా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’…
మాటల రచయితగా ‘లక్కీ భాస్కర్’కు వెంకీ అట్లూరి
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో అవార్డు వచ్చింది. ‘బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్’ విభాగంలో నితిన్ జహాన్ చౌదరి ఆ అవార్డు అందుకోనున్నారు. అలాగే, బెస్ట్ పాపులర్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. ఉత్తమ మాటల రచయితగా ‘లక్కీ భాస్కర్’ సినిమాకు గాను ఆ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి అవార్డు అందుకోనున్నారు.
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ (నాగ్ అశ్విన్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: కల్కి 2898 ఏడీ (నితిన్ జిహానీ చౌదరి)
ఉత్తమ సహాయ నటుడు: సంయ్ మిశ్రా (భక్షక్)
ఉత్తమ సహాయ నటి (ఇద్దరికి): రూపశ్రీ వర్కాడే (మిథ్య), సచన నమిదాస్ (మహారాజ)
నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళ’కు బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్
మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు తెలుగులో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’గా అవార్డు వచ్చింది. ఆ సినిమాతో యదువంశీ దర్శకుడిగా పరిచయం అవ్వగా… సుమారు 11 మంది కొత్తవాళ్ళను తెలుగు తెరకు పరిచయం చేశారు నిహారిక. ఆ సినిమాకు మేకప్ విభాగంలో మరో అవార్డు వచ్చింది. ‘బెస్ట్ మేకప్’ అవార్డు పి రవి కుమార్ అందుకోనున్నారు.








