2021 క్రీడాభిమానులకు సినిమాల పండగే..
బయోపిక్ ల వెల్లువలో స్పోర్ట్స్ బయోపిక్ లకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. రియల్ లైఫ్ స్టోరీలతో పాటూ, ఫిక్షనల్ స్టోరీలను కూడా స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి సినిమాలు తీసేందు తెగ ఇంట్రరెస్ట్ చూపిస్తున్నారు. అలా చెప్పుకుంటూ పోతే 2021 సంవత్సరం క్రీడా నేపథ్య సినిమాలదే హవా మొత్తం. ఇప్పటికే డజను పైగానే స్పోర్ట్స్ నేపథ్య సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
తాప్సీ ఏకంగా మూడు స్పోర్ట్స్ కేటగిరీ బయోపిక్స్ లో నటిస్తుంది. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్ ఒకటి, రష్మి రాకెట్ బయోపిక్ ఒకటి, ఇది కాక మరోక సినిమా చేస్తుంది. పరిణీతి చోప్రా హీరోయిన్ గా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతుంది. జెర్సీ హిందీ రీమేక్, షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, తెలుగు జెర్సీకి దర్వకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
83 కపిల్ దేవ్ బయోపిక్ రిలీజ్ కు ముస్తాబవుతుంది. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించగా, తన భార్యగా దీపిక కనిపించనుంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఫర్హాన్ అక్తర్ తుఫాన్ అనే స్పోర్ట్స్ మూవీలో నటిస్తున్నారు. చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ ని ఆనంద్. ఎల్ రాయ్ తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. తులసీదాస్ జూనియర్ అనే క్రీడా నేపథ్య చిత్రంలో సంజయ్ దత్ నటిస్తున్నారు.
చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ తదుపరి స్పోర్ట్స్ డ్రామాను లాక్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళనాడు గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడాకారుడిగా ఎదిగి, చివరకు దేశం అత్యున్నత క్రీడా గౌరవాన్ని గెలుచుకోవడానికి కారకుడైన ప్రతిభావంతుడి కథతో తెరకెక్కుతుంది. బాలీవుడ్ యువనటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఒక స్పోర్ట్స్ బయోపిక్ ను చేయనున్నాడనేది తెలుస్తుంది. బెంగాలీ సినిమా గోలోండాజ్ భారత ఫుట్ బాల్ పితామహుడిగా భావించే నాగేంద్ర ప్రసాద్ బయోపిక్ గా తెరకెక్కింది.
వాస్తవానికి స్పోర్ట్స్ బయోపిక్ లపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రేమ, ఈ సినిమాలను చూస్తుంటేనే అర్థమవుతుంది. జూన్ లో రణ్ వీర్ 83 రిలీజ్ కానుంది. తర్వాత అజయ్ దేవగన్ మైదాన్ అక్టోబర్ లో రిలీజ్ అవనుంది. ఇలా మొత్తం పది చిత్రాలకు పైగానే ఈ యేడాది స్పోర్ట్స్ బయోపిక్ లు రిలీజ్ కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులను మార్చకుండా ఇంతే ఉంచితే ఈ ఇయర్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ కు పండగే.













