Lloyds Technology Centre: ఇన్నోవేషన్, సంస్కృతి సంగమంగా లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ తొలి కంపెనీ డే
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ (ఎల్ టి సి) తన తొలి కంపెనీ డేను హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్స్‌లో విజయవంతంగా నిర్వహించింది. సంస్థ ప్రయాణం, ఉద్యోగులు, అలాగే ఇన్నోవేషన్, ఐక్యత, లక్ష్యసాధనపై ఆధారపడిన బలమైన సంస్కృతిని ఘనంగా జరుపుకునేందుకు ఈ అంతర్గత కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. టెక్నాలజీ ప్రదర్శనలు, నాయకత్వ ప్రసంగాలు, ఉద్యోగుల ప్రతిభకు గుర్తింపు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిసిన ఒక సంపూర్ణ అనుభవంగా ఈ కార్యక్రమం నిలిచింది.
ఈ రోజంతా జరిగిన కార్యక్రమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది *ప్రాజెక్ట్ షోకేస్* . ఎల్ టి సిలో జరుగుతున్న అత్యాధునిక సాంకేతిక అభివృద్ధి, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్‌ను ఇది స్పష్టంగా చూపించింది. ప్రతిభావంతమైన బృందాలు తమ అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణలను మూడు నిమిషాల సంక్షిప్త ప్రజెంటేషన్ రూపంలో ప్రదర్శించగా, వీటిని ప్రతిష్ఠాత్మక అంతర్గత జ్యూరీ మూల్యాంకనం చేసింది. ఈ ప్రదర్శన ప్రపంచస్థాయి టెక్నాలజీ సామర్థ్యాలను నిర్మించాలన్న ఎల్ టి సి నిబద్ధతను చాటిచెప్పింది.
ఉద్యోగులు ప్రదర్శించిన ఉత్సాహభరిత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నృత్య ప్రదర్శనలు, అలాగేల్ టి సిలోనే ఉన్న బ్యాండ్ అందించిన ప్రత్యేక సంగీత ప్రదర్శనలతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా మారింది. కార్యాలయ పనితో పాటు సృజనాత్మకతను, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే వాతావరణాన్ని ల్ టి సి ఎలా పెంపొందిస్తున్నదీ ఇవి స్పష్టంగా చూపించాయి.
ఈ సందర్భంగా ల్ టి సి నాయకత్వ బృందం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఉద్యోగి కేంద్రిత కార్యక్రమాలు, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, సస్టెయినబిలిటీ చర్యలు, అలాగే సంస్థ భవిష్యత్ దృక్పథంపై కీలక సమాచారాన్ని పంచుకుంది. టెక్నాలజీ నైపుణ్యాలతో పాటు సామాజిక బాధ్యత, అభ్యాసం, ఉద్యోగుల సంక్షేమంపై ఎల్ టి సి చూపిస్తున్న నిబద్ధతను ఈ ప్రసంగాలు హైలైట్ చేశాయి.
కార్యక్రమం చివర్లో నిర్వహించిన అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ వేడుకలో ఏడాది పొడవునా అసాధారణ అంకితభావం, ఇన్నోవేషన్, సహకారాన్ని ప్రదర్శించిన వ్యక్తులు, బృందాలకు పురస్కారాలు అందజేశారు. ఇవి ఎల్ టి సి విలువలు, సంస్కృతి, అలాగే ప్రేరణాత్మక పని వాతావరణాన్ని నిర్మించాలన్న లక్ష్యాన్ని మరింత బలపరిచాయి.
*ఈ సందర్భంగా లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ శీరిషా వోరుగంటి మాట్లాడుతూ,* “మా తొలి కంపెనీ డే లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్‌ను నిర్వచించే ప్రతిభ, ఆత్మస్థైర్యానికి అద్దం పడుతుంది. ఇది మన సమిష్టి విజయాలను జరుపుకునే రోజు, అలాగే మా ఇన్నోవేషన్ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్న అసాధారణ వ్యక్తులు, బృందాలను గుర్తించే రోజు. ప్రాజెక్ట్ షోకేస్‌లో కనిపించిన సృజనాత్మకత, అన్ని కార్యక్రమాల్లో కనిపించిన సహకార భావన, మా సంస్కృతి మా గొప్ప బలమని నిరూపిస్తున్నాయి. మేము ప్రపంచస్థాయి టెక్నాలజీనే కాకుండా, ప్రతి వ్యక్తి విలువైనవాడిగా భావించే, భవిష్యత్తును మలిచే శక్తి ఉన్న సమగ్ర కార్యాలయ వాతావరణాన్ని కూడా నిర్మిస్తున్నాం” అని అన్నారు.
వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడిస్తూ, ఎల్ టి సి యొక్క సీఎస్ఆర్ భాగస్వామ్య ఎన్జీఓల ద్వారా వచ్చిన చిన్నారులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. ఇది వారి ప్రతిభను చాటడంతో పాటు, విద్యా మరియు సాధికారత కార్యక్రమాల ద్వారా వెనుకబడిన పిల్లలకు అవకాశాలు కల్పించేందుకు ఎల్ టి సి చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ప్రతీకగా నిలిచింది.
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ గురించి
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ (ఎల్ టి సి) అనేది యూకేలో అతిపెద్ద డిజిటల్ బ్యాంక్ అయిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్‌కు చెందిన భారత్‌లోని టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ హబ్. హైదరాబాద్‌లో ఉన్న ఈ కేంద్రం, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కీలక పాత్ర పోషిస్తోంది.
4050కిపైగా ఉద్యోగులతో, ఎల్ టి సి ఇంజినీరింగ్ ఎక్సలెన్స్‌ను అందిస్తూ, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తూ, సమగ్ర వృద్ధిని సాధిస్తోంది. భారత్‌లో ఆర్థిక సేవలను అందించకపోయినా, లాయిడ్స్ గ్లోబల్ టెక్ వ్యూహంలో ఇది ఒక కీలక భాగంగా కొనసాగుతోంది.






