Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం.. ఇకపై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్ (Transgender )మహిళలు ఇకపై మహిళల ((women’s) క్రీడల్లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. మహిళల క్రీడల నుంచి పురుషుల (Men’s)ను బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుతో మహిళల క్రీడలకు స్వేచ్ఛ లభించినట్లేనని ట్రంప్ ప్రకటించారు. ఇకపై మహిళలు పాల్గొనే క్రీడల్లో ట్రాన్‌జెండర్లు భాగస్వాములైతే సదరు క్రీడల నిర్వాహకులపై జరిమానా విధించే అవకాశం ఉంది. నిబంధనలు అతిక్రమిస్తే ప్రభుత్వ నుంచి ఆర్థిక సాయం (Financial assistance )అందదు. తమ దేశంలో పురుషులు, మహిళలు అనే రెండు వర్గాలకే గుర్తింపు ఉంటుందని, ట్రాన్స్‌జెండర్ అనే వర్గాన్ని గుర్తించడం లేదని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రాన్స్‌జెండర్ల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు.