Donald trump :త్వరలోనే పుతిన్‌తో మాట్లాడతా : ట్రంప్

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పరిష్కరించే విషయమై త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin )తో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తెలిపారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, అమెరికా నుంచి సమాధానం కోసం వేచి చూస్తున్నామని ఇటీవలే రష్యా (Russia) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ స్పందించారు. ఆయన ( పుతిన్) మాట్లాడాలనుకుంటున్నారు. త్వరలోనే చర్చలు జరుగుతాయి. నేను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) తో చాలా సార్లు మాట్లాడాను. వారు శాంతిని కోరుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారు. పుతిన్ కూడా ఇదే విషయాన్ని కోరుకుంటున్నట్లు భావిస్తున్నాం. మేం సాయం చేయానికి ప్రయత్నిస్తాం అని ట్రంప్ అన్నారు. తన తొలి విదేశీ పర్యటన బ్రిటన్ లేదా సౌదీ అరేబియా ఉండొచ్చన్నారు.