Kennedy :కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం ?

అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ (John F. Kennedy) హత్యలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) హస్తంపై ట్రంప్ (Trump) సర్కారు తాజాగా విడుదల చేసిన రహస్య దస్త్రాలు అనుమానం వ్యక్తం చేశాయి. కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం ఉండొచ్చని మొదటి నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఐఏ పాత్రను నేరుగా వెల్లడిరచనప్పటికీ హత్యకు సంబంధించి ముందస్తు హెచ్చరికలను సీఐఏ నిర్లక్ష్యం చేసిందని రహస్య దస్త్రాలు నిందించాయి. 1963లో కెనడీ డల్లాస్ (Dallas)లో హత్యకు గురయ్యారు. కాన్వాయ్‌లో వెళుతున్న కెనడీపై కాల్పులు జరపడంతో ఆయన మరణించారు.