అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వివేక్ రంగస్వామి!
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో యువ పారిశ్రామికవేత్త ఉండబోతున్నారని ప్రచారం జరుగుతోంది. భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వివేక్ రామస్వామికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉందని చాలా మంది చెబుతున్నారు. ఈయన కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. వివేక్ రంగస్వామి వ్యాపారవేత్తగానే గాక, ఇన్వెస్టర్ గుర్తింపు పొందారు. బయోఫార్మాసూటికల్ కంపెనీ రోయివంట్ సైన్సెస్ కు వ్యవస్థాపక సీఈవో. వోకిఇజం, సోషల్లీ, రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్‌పై తన అభిప్రాయాలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయంగా వివేక్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన అధ్యక్ష రేసులో నిలబడేందుకు సరైన అభ్యర్థి అని చాలా మంది భావిస్తున్నారు. అయితే వివేక్ అభ్యర్థిత్వాన్ని కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రెసిడెన్సీకి వ్యాపార ఆధారిత విధానాన్ని తీసుకురాగల సరికొత్త వ్యక్తిగా అతడ్ని కొందరు చూస్తున్నారు.






