అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో… ట్రంప్ ప్రత్యర్థి ఎవరు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ నుంచి డెమోక్రాటిక్ పార్టీ నామినీ జో బైడెన్ వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకీ బలపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీలోని కీలక ప్రతినిధులే ఆయన వైదొలగాలని పట్టుబడుతున్నారు. ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాలా మంది బైడెన్ నిష్క్రమించాలని అభిప్రాయపడ్డట్లు సమాచారం. కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచినవారూ ఉన్నారని తెలుస్తోంది. ట్రంప్‌తో సంవాదంలో బైడెన్ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో దీనిపై ఓ స్పష్టతకు వచ్చేలా కీలక నేతలతో హకీం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్ పోటీలో ఉండొద్దని పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు వెల్లడిరచాయి. ఆయన వల్ల అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ట్రంప్ నుంచి దేశాన్ని రక్షించాలంటే బలమైన నేతను బరిలో నిలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.
అయితే, తాను వైదొలిగే ప్రసక్తే లేదని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. తాను రేసులో ఉండాలా? వద్దా? అనే దానిపై పార్టీలో అంతర్గతంగా సాగిస్తున్న నాటకాలకు ముగింపు పలకాలని డెమోక్రాట్లపై లేఖాస్త్రం సంధించారు. వారం రోజులుగా ఈ అంశంపై చర్చోపచర్చలు సాగిస్తున్నారని.. వాటికి తెరదించే సమయం వచ్చిందన్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఓడిరచడమే పార్టీ ముందున్న ఏకైక లక్ష్యమన్నారు. మరో 119 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇటువంటి కీలక సమయంలో పార్టీ సంకల్పం బలహీనపడటం, ఎలా వ్యవహరించాలనేదానిపై స్పష్టత లేకపోవడం.. కేవలం ట్రంప్‌నకే మేలు చేకూరుస్తుంది. మనం నష్టపోతాం. మనమంతా ఏకతాటిపైకి వచ్చే, ఐక్యంగా ముందుకు సాగే, ట్రంప్‌ను ఓడిరచే సమయం ఆసన్నమైంది’’ అని బైడెన్ తన లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న బైడన్ .. ప్రస్తుతం పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయారని అంటున్నారు. ముఖ్యంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్తి ట్రంప్ తో అట్లాంటా వేదికగా జరిగిన డిబేట్ లో పేలవమైన ప్రదర్శన కనబర్చడం.. బైడన కు సమస్యలు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు బైడన్ అభ్యర్థిత్వంపైనే డెమొక్రాట్లలో పెద్ద చర్చే జరుగుతోంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న బైడన్ స్థానంలో .. డెమొక్రాట్లను గట్టెక్కించే అభ్యర్థి ఎవరా అన్న చర్చ పార్టీలోనూ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఉన్న అభ్యర్థుల్లో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ వైపు… అత్యధిక డెమొక్రాట్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వార్థక్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బైడన్ తో పోలిస్తే.. కమలా హ్యారిస్ వాగ్దాటి కలిగిన వ్యక్తిగా చెబుతున్నారు డెమొక్రాట్లు. ముఖ్యంగా బైడన్ వయస్సు 81 ఏళ్లు.. ట్రంప్ వయస్సు 78 కాగా.. కమలా వయస్సు 59 ఏళ్లు మాత్రమే.. అంటే వీళ్లిద్దరితో పోలిస్తే కమలా హ్యారిస్ .. ఆరోగ్యపరంగా, వయస్సు పరంగా యాక్టివ్ రోల్ పోషిస్తారు.
దీంతో బైడన్ స్థానంలో కమలాను దించితే .. యువత, మధ్యతరగతి వయస్సు వారిని ఆకట్టుకోవచ్చని డెమొక్రాట్లు భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ కు, బైడన్‌కు మధ్య పాపులారిటీ కూడా ఓ సమస్యగా చెప్పవచ్చు. గతంలో జరిగిన ఓ సర్వేలో ట్రంప్ నకు 49 శాతం మంది మద్దతివ్వగా బైడన్ కు 43 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలుస్తున్నారు. అదే ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య పాపులారిటీపై సర్వే జరగ్గా ట్రంప్ నకు 45 శాతం మంది, కమలాకు 43 శాతం మంది మద్దతిచ్చినట్లు తేలింది . అంటే ఇది స్వల్పంగా చెప్పవచ్చు. దీంతో కమలాను అభ్యర్థిగా ప్రకటిస్తే మళ్లీ డెమొక్రాట్లు అధికారంలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరో ముఖ్య విషయం కమలా హ్యారిస్.. భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. ఆమె వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సమయంలో భారతదేశంలోని ఆమె పూర్వికుల స్వస్థలంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అంటే హ్యారిస్ కు భారతీయ అమెరికన్ల నుంచి మద్దతు ఉండే అవకాశముంది. అదీ కాక… ఆమె నల్లజాతీయురాలు.. ఈపదవికి ఎన్నికైతే .. తొలి నల్లజాతీయ అధ్యక్షరాలిగా రికార్డ్ సృష్టించే అవకాశముంది. దీంతో నల్లజాతీయుల ఓట్లు కూడా ఈమెకు పడే అవకాశాలున్నాయని డెమొక్రాట్లు విశ్వసిస్తున్నారు. 2020 నుంచి బైడన్-కమలా హ్యారిస్ ద్వయం అమెరికా పాలనను నిర్వహిస్తోంది. పాలనా వ్యవహారాల్లోనూ కమలా అనుభవం గడిరచారు. దీంతో ఈ అనుభవం క్షూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు డెమొక్రాట్లు. మరోవైపు బైడన్ తనంతట తాను విరమించుకుంటేనే.. కమలాకు మద్దతుగా నిలుస్తామని పలువురు సీనియర్ సభ్యులు చెబుతుండడం గమనార్హం.
బైడెన్ (దీఱసవఅ) వైదొలగితే కమలా హ్యారిస్‌ను (ఖaఎaశ్రీa నaతీతీఱం) పోటీలో ఉంచాలని రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో చాలా మంది నేతలు అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. ఆమె బరిలో ఉంటే ట్రంప్‌ను ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చాలా మంది బైడెన్ నిష్క్రమ ణకు పట్టుబట్టాలని ఇప్పటికే నిర్ణయించుకు న్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం జరగనున్న కాకస్ సమావేశంలో ఏదో ఒకటి తేలే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పార్టీ ప్రతినిధులు వెల్లడిరచారు. బైడెన్‌కు ఉన్న అనుభవం, ప్రతిష్ఠ నేపథ్యంలో బరి నుంచి దూరం జరిగే ప్రక్రియ సజావుగా సాగితే బాగుంటుందని భావిస్తున్నట్లు వివరించారు.
మరోవైపు బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పోటీలో ఉండాలా? లేదా? అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. గ్రీన్ ఇటీవల బైడెన్‌తో పాటు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నుంచి ఈ తరహా ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే.. ఆ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని కూడా వెల్లడిరచడం గమనార్హం.






