ఆంక్షల అమల్లో భారతీయ అమెరికన్ కీలక పాత్ర
రష్యాపై అమెరికా ఆంక్షలను విధించడంలో భారతీయ అమెరికన్ ఆర్థిక సలహాదారు దలీప్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అయిన సింగ్ వైట్‌హౌస్ ప్రెస్ రూంలో మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని దీర్ఘకాలంగా భావిస్తున్న రష్యా తన పనిని మొదలు పెట్టింది. దీంతో మేం (అమెరికా) కూడా మా పని ప్రారంభించాం. అధ్యక్షుడు జో బైడెన్ వెంటనే మిత్రపక్షాలను సంప్రదించి రష్యాపై ఆంక్షలు విధించారు. మా మిత్రపక్షాల సత్తా ఏంటో కూడా చూపించాం అని సింగ్ స్పష్టం చేశారు.






