America: అమెరికా కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌కు
రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం తీవ్రరూపం దాల్చొచ్చన్న భయాందోళనల మధ్య అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ (Ukraine) కు అణ్వాయుధాలు తిరిగి ఇవ్వబోమని అగ్రదేశం ప్రకటించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత కీవ్ (kievan) వదులుకున్న అణ్వాయుధాలను తిరిగి అప్పటించే ప్రసక్తే లేదని హౌట్ హౌస్ తేల్చి చెప్పింది. అలాంటి ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని, ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుంటూ రష్యా (russia)పై పోరాడేందుకు మాత్రమే సాయం చేస్తున్నామని తెలిపింది. పదవి నుంచి దిగిపోయే ముందు ఆ దేశానికి అణ్వాయుధాలు ఇవ్వాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు కొందరూ సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్పందన వచ్చింది.






