త్వరలో పుతిన్, బైడెన్ భేటీ!
రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ మధ్య అంగీకారం కుదిరింది. ఉభయనేతలు ఈ సంక్షోభం పరిష్కార దిశలో భాగంగా 105 నిమిషాల పాటు ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రస్తుత సంక్షోభం నివారణకు దౌత్యపరంగా ఏదైనా చేయడానిjకి సిద్ధంగా ఉన్నటు మేక్రాన్ ప్రకటించింది. రానున్న రోజుల్లో రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు సమావేశమవుతారు. ఉక్రెయిన్ యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించడానికి, యుద్ధాన్ని నివారించడానికి ఉపయోగపడుతుందనుకుంటే ఏ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలుసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇష్టపడ్డారని ఆయన ఉన్నత దౌత్యప్రతినిధి వెల్లడించారు.
అమెరికా చాలావేగంగా ఈ చర్చలు సాగిస్తుందని, తాము చూస్తున్న ప్రతీదీ చాలా తీవ్రమైన అంశమని తాము దండయాత్ర అంచునా ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తెలిపారు. యుద్ధ టాంకులు సాగుతున్నంతవరకు, విమానాలు ఎగురుతున్నంత వరకు ప్రతి అవకాశాన్ని, ప్రతినిముషాన్ని దౌత్యపరమైన పరిష్కారం కోసం వినియోగించుకుంటామని తెలిపారు.






