Trump: ట్రంప్ పరిపాలన 2.0 ఎలా ఉంటుంది? ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత జాతిని ఉద్ధేశించి చేసిన ప్రసంగం ఏమి చెపుతోంది?

మొదటి నుంచి ఇండియన్ మీడియా డెమొక్రాట్లు కి మద్దతుగా ఉంటుందని అందరికీ తెలుసు. అలాగే కొన్ని పత్రికలు, చానెళ్లు వార్తలను మరీ సంచలనాత్మకం ( sensationalization ) చేస్తాయని కూడా మనకు తెలుసు. ఆ నేపథ్యంలోనే గత 3 వారాలుగా ట్రంప్ అధ్యక్షుడిగా రాగానే తీసుకొనే నిర్ణయాలు మీద అనేక కథనాలు వచ్చాయి. మన విద్యార్దులు ఇక అమెరికా వెళ్ళలేరని, వెళ్లిన వాళ్ళు వెనక్కి వచ్చేయాలని, H1B వీసా లు తగ్గి పోతాయని, అమెరికా ఆశలు ఇంక పెట్టుకోకూడదని వచ్చిన వార్తలే ఎక్కువ. అయితే నేను మొదటి నుంచి అలా వుండదని అనుకొంటూ, చెపుతూ వుంటాను.. నిన్ననే (20 జనవరి) ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ( ఆయన ఇండియా టైమ్ రాత్రి 10.30pm కి చేసారు) సాయత్రం 4.30pm కి ABN Andhra Jyothi TV లో, ఆయన అధ్యక్షుడిగా 10.40pm కి మాట్లాడిన తరువాత 99TV లో జరిగిన చర్చల్లో పాల్గొన్నాను. ఆ విషయాలే తెలుగు టైమ్స్ పాఠకులకు, ఫేస్ బుక్ మిత్రులకు, చెప్పాలని ఇక్కడ ఇస్తున్నాను.
ట్రంప్ మొదటి నుంచి చెపుతున్నట్టు గానే ( ఎన్నికల సమయం లో, గెలిచిన తరువాత ) తన ప్రసంగం ” from this moment my Govt will work on Make America Great Again ” అని మొదలెట్టారు. ఆ పనిలో తాను అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవాళే విడుదల చేస్తున్నాను అని చెప్పారు. మొదటగా నార్తన్ బోర్డర్స్ లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి మెక్సికో, కెనడా లను వచ్చే వలసలను ఆపడానికి అన్ని చర్యలు తీసుకొంటామని చెప్పారు. అలాగే అమెరికా లో ఇప్పటికే వున్న అక్రమ వలసదారుల ను ( illegal immigrants) గుర్తించి వెనక్కి పంపే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ( న్యాయ పరంగా వెళ్లిన విద్యార్దులు, ఉద్యోగుల గురించి ఏమీ అన లేదు.)
దేశం లో inflation బాగా పెరిగిందని, దానికి అరికట్టి నిత్యావసర ధరలు తగ్గేలా చర్యలు తీసుకొంటామని అన్నారు. అలాగే law & order పరిస్థితి చాలా అద్వాన్నంగా వుందని, దానిని సరిచేసి ప్రజలకు, ఆస్తులకు తగిన రక్షణ వుండేలా చేస్తానని అన్నారు. ( ఈ రెండు ఎంత జరిగితే అక్కడ వున్న మన వాళ్లకు అంత మంచిదే కదా!)
తన ప్రభుత్వం ఇక మీదట color blind, talent based గా వుంటుందని అన్నారు. ఇదివరకు ట్రంప్ హయాం లో అమెరికా లో నల్ల జాతి ( Blacks ) మీద, ఇతర జాతి వారి మీద వివక్ష వుందని అందరూ అను కొన్నారు కదా.. ట్రంప్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో తనకొచ్చిన ఇమేజ్ ని సరిచేసుకోవాలని అనుకొన్నట్టు గా అర్ధం అవుతోంది. అలాగే టాలెంట్ వున్నవారిని ప్రోత్సహించే విధంగా తమ విధి విధానాలు వుంటాయని చెప్పటం ఒక మంచి పరిణామం. టాలెంట్ మీద, స్కిల్ మీద అక్కడకు వచ్చే ఉద్యోగస్తులు, వారు పెరిగి ఎంట్రప్రెన్యూర్స్ గా మారే విధానాలకు ప్రోత్సాహం అంటే ఇండియా నుంచే వెళ్లే స్టూడెంట్స్ కి, H1B ఉద్యోగస్తులకు శుభవార్తే కదా!
హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్ లలో అనేక అభివృద్ధి చర్యలు చేస్తానని, ట్రేడ్ విషయంలో కూడా పెను మార్పు తెచ్చి బిజినెస్ వాతావరణం తీసుకొస్తానని చెపుతున్నారు. అమెరికా ని మళ్లీ Manufacturing country గా చేస్తామని చెప్పారు. అమెరికా కు పేరు తెచ్చిన ఆటో మొబైల్ రంగం తో పాటు ఎలక్ట్రానిక్స్ రంగం లో కూడా అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడతామని చెప్పారు. అనవసర ఖర్చు తగ్గించుకునే దిశగా , ప్రభుత్వ శాఖలలో సామర్దత పెరిగే రెండు వేరు వేరు శాఖలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది చాలా మంచి పరిణామం. స్వతహాగా డబ్బుతో వచ్చిన గర్వం, రెండోసారి గెలిచిన తర్వాత వచ్చే ఆత్మ విశ్వాసం తో వున్నా డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఈ మాటలు ( లేదా కార్యక్రమ వివరాలు) ఆయన మారుతున్నారు అని చెబుతున్నాయి.
ఒక పెద్దన్న గా భావించే అమెరికా ప్రెసిడెంట్ గా ప్రపంచంలో జరిగే యుద్ధాలు ఆపటానికి ప్రయత్నిస్తామని, తాముగా ఎలాంటి యుద్దాలు చేయబోమని తెలిపారు. ఇదివరకు దూకుడు తో చైనా మీద, రష్యా మీద అనేక వాఖ్యానాలు చేసినా, ఇప్పుడు చైనా, రష్యా దేశాల అధిపతులకు ఆహ్వానం పంపి స్నేహ పూరిత వాతావరణం చెప్పట్టారు.
అమెరికా లో నిషేధించిన చైనా కంపెనీ టిక్ టాక్ ని మళ్లీ అమెరికా కి వచ్చేందుకు కొన్ని షరతులతో అనుమతిస్తామని ( అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా ఒక అమెరికా కంపెనీ 50% భాగస్వామి గా ఉంటే) చెప్పారు. ప్రస్తుతం ట్రంప్కు అత్యంత సన్నిహితుడు గా వున్నా ఎలాన్ మస్క్ ( Elon Musk – CEO -Tesla , X companies ) ఇందుకు కారణం అన్న కథనం నిజమే అయ్యుండచ్చు. త్వరలో ఇండియా, చైనా , రష్యా దేశాలకు వెళతానని చెప్పడం తో ట్రంప్ ఇండియా ను కూడా నేడు ప్రపంచంలో వున్న పెద్ద దేశాల్లో ఒకటి గా గుర్తించడం కదా! దానికి కారణం ప్రస్తుతం అమెరికా ఎకానమీ ని నిర్దేశించే అనేక వస్తువులు చైనా నుంచి వస్తూ ఉంటే, మానవ వనరులు ఇండియా నుంచి వస్తున్నాయి కదా !
ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన ప్రసంగం మీద చేసిన విశ్లేషణ ఇది. ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసే 100 ఓ Executive orders చూసాక మరింత లోతుగా విశ్లేషించవచ్చు! ప్రస్తుతానికి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు ఆందోళన పడక్కర్లేదు అని అనుకుందాం.
చెన్నూరి వెంకట సుబ్బారావు
ఎడిటర్ తెలుగుటైమ్స్