75 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తా : వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (2024) తాను గెలిచినట్లైతే ఫెడరల్ ఉద్యోగుల్లో 75 శాతానికిపైగా తొలగిస్తానని, ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) వంటి అనేక సంస్థల్ని మూసేస్తానని రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ప్రకటించారు. ఇలాంటి ప్రతిపాదనతోనే ఎన్నికల ప్రైమరీల్లో ఆయన ఇప్పటికే దూసుకుపోతున్నారు. దేశంలో 22.5 లక్షల మంది ఫెరడల్ ఉద్యోగులు ఉన్నారని, వారిలో 16 లక్షల మందిని ( 75శాతం) తొలగిస్తానని రామస్వామి తెలిపారు. ఎఫ్బీఐతో పాటు విద్యాశాఖ, మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల బ్యూరో, అణు నియంత్రణ కమిషన్, ఐఆర్ఎస్ (అంతర్గత రెవెన్యూ సేవలు) వాణిజ్య విభాగం తన లక్ష్యాలని తెలిపారు.






