Prince Harry : ప్రిన్స్ హ్యారీని బహిష్కరించబోం :ట్రంప్

బ్రిటిష్ రాయల్ ప్రిన్స్ హ్యారీ (Prince Harry ) ఇమిగ్రేషన్ స్టేటస్ చుట్టూ కొనసాగుతున్న చట్టపరమైన సవాళ్ల మధ్య మాజీ డ్యూక్ ఆఫ్ ససెక్స్ (Duke of Sussex) ను బహిష్కరించే యోచన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ఇప్పటిఏ హ్యారీకి తన భార్య (Wife)తో చాలా సమస్యలు ఉన్నాయని, ఆయనను దేశం నుంచి వెళ్లిపొమ్మనే ఆలోచన లేదని ట్రంప్ స్పష్టం చేశారు. నేను అలా చేయదలచుకోలేదు. అతన్ని ఒంటరిగా వదిలేస్తాను. భార్యతో చాలా సమస్యలు ఉన్నాయి. ఆమె చాలా భయంకరమైనది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.