అమెరికా వాసులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలి
రష్యాపై ఆంక్షలు పెంచడంతో పాటు ఉక్రెయిన్‌కు అన్నివిధాలా మిలిటరీ సాయం అందిస్తున్న అమెరికా ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తోంది. రష్యాలో ఉన్న అమెరికా వాసులు తక్షణమే ఆదేశాన్ని వీడాలని సూచించింది. మాస్కోలోని తమ రాయబార కార్యాలయానికి చెందిన సాధారణ సిబ్బంది, కుటుంబ సభ్యులను స్వచ్ఛదంగా వెనక్కి రావాలని ఆదేశించింది. ఆర్థిక మూలాలపై ఆంక్షలు విధించడం, ఉక్రెయిన్‌కు సాయుధ సాయంతో పాటు రష్యాను పదేపదే హెచ్చరిస్తున్న సంఘటనల ఆధారంగా అమెరికా తమ పౌరుల భద్రత కోసం వెంటనే రష్యాను వీడి వచ్చేయాలని కోరింది. అంతేకాకుండా రష్యా సేనలకు స్థావరంగా ఉపయోగపడుతున్న బెలారన్పైనా అమెరికా ఆంక్షలు ప్రకటించింది. బెలారన్లోని స్థావరాల నుంచే రష్యా ఉక్రెయిన్‌పై కాల్పులకు తెగబడుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. అందువల్లనే బెలారస్ పైనా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. తమ ఎంబసీ కార్యకలాపాలను కూడా నిలిపివేసింది.






