భారత్-పాక్ మధ్య చర్చలకు సిద్ధం : అమెరికా
భారత్-పాకిస్థాన్ మధ్య ఆందోళన కలిగించే అంశాలపై చర్చలను ప్రారంభించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్యం విదేశాంగశాఖ పేర్కొంది. అగ్రరాజ్యం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఆందోళన కలిగించే సమస్యలపై భారత్-పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతు ఇస్తామన్నారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ప్రకటన చేయడం విశేషం. ఇదిలా ఉండగా ప్రస్తుత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్తో చర్చలు జరపాలనే కోరికను వ్యక్తం చేశారు.






