మా జోలికొస్తే.. ఇలాగే ఉంటుంది : బైడెన్
ఇటీవల జోర్డాన్‌లో అమెరికా సైనిక క్యాంప్‌పై జరిగిన డ్రోన్ దాడికి అగ్రరాజ్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాక్, సిరియా లోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడులపై తాజాగా అధ్యక్షుడ జో బైడెన్ స్పందించారు. తాము ఘర్షణలను కోరుకోవడం లేదని, కానీ అమెరికన్లకు హాని కలిగిస్తే మాత్రం ప్రతిచర్య ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు. మధ్య ప్రాచ్యం లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఘర్షణలు జరగాలని మేం కోరుకోవట్లేదు. కానీ, మాకు నష్టం కలిగించాలని చూసే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అమెరికన్లకు హాని చేస్తే మేం కచ్చితంగా ప్రతిస్పందిస్తాం అని బైడెన్ వెల్లడిరచారు. రానున్న రోజుల్లో తమ టార్గెట్లపై మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు.






