ట్రంప్ ఆరోపణల దృష్ట్యా జార్జియాలో రీకౌంటింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై 14 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యంతో జో బైడెన్ గెలుపొందిన జార్జియా రాష్ట్రంలో ఓట్ల రీకౌంటింగ్ చేతులతో లెక్కిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్‌కు, బైడెన్‌కు మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉన్న దృష్ట్యా రీకౌంటింగ్ అనివార్యమైందని జార్జియా మంత్రి బ్రాడ్ రాఫెన్స్ పెర్జెర్ తెలిపారు. ఓట్లను చేతులతో తిరిగి లెక్కించడం కేవలం అధ్యక్ష ఎన్నికలకు మాత్రమే పరిమితమని రిపబ్లికన్ పార్టీకి చెందిన బ్రాడ్ తెలిపారు. జార్జియాలో 16 ఎలెక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. జార్జియాలో ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. అయితే ఇప్పటివరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఏమీ లభించలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు.






