పారిస్ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా
పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా అధికారికంగా బయటకు వచ్చేసింది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో ఇదొకటి. 2017లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమలులోకి వచ్చింది. ఈ శతాబ్దాంతానికి భూతాపం 2 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరగకుండా కట్టడి చేయాలన్నది పారిస్ ఒప్పంద సారాంశం. అందుకు కాలుష్యాన్ని తగ్గించే చర్యలకు ఆయా దేశాలు పూనుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లే దేశాల్లో చైనా తర్వాత అమెరికాది రెండో స్థానం. పారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తే 2025 వరకల్లా తమ దేశం 25 లక్షల ఉద్యోగాలను కోల్పోతుందని ట్రంప్ అన్నారు.






