కమలా హారిస్ ప్రచారంలో.. నాటు నాటు జోరు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థుల్దిరు వినూత్నంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా భారత మూలాలున్న డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ గతేడాది ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు (ఆర్ఆర్ఆర్ చిత్రం) పాటను ప్రయోగించారు. ఈ పాట స్ఫూర్తితో భారత అమెరికన్ నాయకుడు అజయ్‌జైన్ భుటో రియా నాచో నాటో (నాటు నాటు హిందీ వెర్షన్) పేరుతో ప్రచార గీతాన్ని విడుదల చేశారు. కమలా హారిస్ ప్రచార చిత్రాలను ఈ పాటతో అనుసంధానించి పలుచోట్ల ప్రదర్శిస్తున్నారు. నాచో నాచో కేవలం పాటు కాదు. ఇది ఒక ఉద్యమం. దక్షిణాసియన్లు, భారతీయులతో అనుసంధానం కావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగుతోంది. ఈ పాటలోని సాహిత్యం, నృత్యం సమాజంలో పండుగ వాతావరణాన్ని సృష్టించి హారిస్‌కు ఓటు వేయాలనే బలమైన సందేశాన్ని పంపుతున్నాయి. 60 లక్షల మంది దక్షిణాసియన్లు, 44 లక్షల మంది భారతీయుల ఓట్లను కూడగట్టడమే మా లక్ష్యం అని అజయ్ పేర్కొన్నారు.






