మళ్లీ బ్యాలెట్ పేపర్ తీసుకురావాలి : ట్రంప్
ఎన్నికలు నిజాయితీగా జరగాలంటే అది పేపర్ బ్యాలెట్‌తోనే సాధ్యమవుతుందని, పేపర్ బ్యాలెట్‌ను తిరిగి తీసుకురావాలని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. 2020 అధ్యక్ష ఎన్నికలు మోసపూరితమైనవిగా పేర్కొన్నారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఓటింగ్ విధానాన్ని ట్రంప్ విమర్శించారు. పేపర్ బ్యాలెట్ తీసుకురాకపోతే, ఎన్నికల్లో నిజాయితీని నిర్ధారించలేమన్నారు. 2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలుగా పేర్కొన్నారు.






