గెలుపెవరిది? అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయుల అభిప్రాయాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రోజుల్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. అధికార డెమొక్రాట్ల తరపున అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్, గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్ల తరపున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య గెలుపుదోబూచులాడుతోందని చెప్పవచ్చు. ఆరంభంలో అంటే.. బైడన్ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ట్రంప్ గెలుపు నల్లేరుపై నడకగా భావించారు. అయితే.. ఎప్పుడైతే కమలా హ్యారిస్ అభ్యర్థిగా బరిలో నిలిచారో.. అప్పటి నుంచే అసలైన సమరం మొదలైంది. మాటకు మాట.. కౌంటర్, రివర్స్ కౌంటర్స్ తో ఇరువురు అభ్యర్థులు దూసుకుపోతున్నారు. దీంతో సర్వేలు సైతం.. ఎవరు గెలుస్తారో చెప్పలేక గందరగోళంలో పడిన పరిస్థితి కనిపిస్తోంది.
ఆరంభంలో కమలా దూకుడు ప్రదర్శించినా.. చివరకు వచ్చేసరికి జనాదరణలో డొనాల్డ్ ట్రంప్.. స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా వైటర్స్.. ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్నారు.వీరికి తోడు నిరుద్యోగ యువత సైతం ట్రంప్ పై సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఇక వెల్లువెత్తుతున్న వలసలను ట్రంప్ సరిగ్గా నియంత్రించగలరని యువత భావిస్తోంది. ప్రస్తుతం ఎటుచూసినా యుద్ధ వాతావరణం తాండవిస్తోంది. ఈ సమయంలో ట్రంప్ లాంటి వ్యక్తి సమర్థుడిగా పనిచేస్తారన్నది కొందరి వాదన.
ఇక కమలా హ్యారిస్… ఈమెకు భారతీయ మూలాలు, ఆఫ్రో అమెరికన్ బ్యాక్ గ్రౌండ్ ఉండడం, మహిళ కావడంతో సాదారణంగా ఈవర్గాలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అబార్షన్ హక్కుల విషయంలో ట్రంప్ వైఖరిని మహిళలు అంగీకరించడం లేదు. అంతెందుకు సాక్షాత్తు ట్రంప్ సతీమణి మెలానియా కూడా.. ఆ విషయాన్ని మహిళలకే అప్పగించాలనడం ఇక్కడ కొసమెరుపు. అందువల్లే ఆమెకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే యుద్ధవాతావరణం, వలసలపై మితవాద వైఖరి ఆమెకు కాస్త నెగటివ్ గామారుతున్న సూచనలున్నాయి.
ఎన్నికల ప్రచారానికి వస్తే.. ట్రంప్ ఒంటరిగానే దూసుకెళ్తున్నారు. తానే ప్రచారానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ముందుకు నడిపిస్తున్నారు. ఫలితంగా ఎన్నికలు కూడా ట్రంప్ వర్సెస్ డెమొక్రాట్లు, ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ అన్నట్లుగా సాగుతున్నాయి. ట్రంప్ ను నియంత, అసమర్థుడు అని కమలా విమర్శిస్తుంటే.. హారిస్ అధ్యక్షురాలైతే చైనా ఆడేసుకుంటుందని రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థపై ఇరువురు నేతలు భిన్నాభిప్రాయాలు
కమలా హ్యారిస్ ప్రజాజీవనానికిపెద్దపీట వేస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతిప్రజలకు మేలు కలిగేలా నిర్ణయాలుంటాయంటున్నారు. దీనికి గానూ అమలు చేసే పథకాలకు బడ్జెట్ నుంచే కేటాయింపులు ఉంటాయంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం.. అప్పు చేసైనా ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్తామంటున్నారు. అది పెట్టుబడి కాబట్టి.. దానిఫలితాలు తప్పక ఉంటాయంటున్నారు.అంతేకాదు.. పెట్టుబడి దారులకు ట్యాక్స్ తగ్గించడం ద్వారా.. పెట్టుబడులు ప్రవహిస్తాయని.. ఫలితంగా దేశం పురోగమిస్తుందంటున్నారు ట్రంప్.
సరిహద్దు వలసలు..
గత పాలనలో ట్రంప్.. సరిహద్దు వలసల విషయంలో కఠిన వైఖరి అవలంభించారు. ఈవిషయంలో మెక్సికోతో పరోక్ష ఘర్షణ వరకూ వెళ్లారు కూడా. అమెరికా ఫస్ట్ ..నినాదం.. ట్రంప్ కు చాలా సానుకూలంగా ఉంది. భారత్ లాంటి దేశాలు కూడా తమదేశంలో కంపెనీల నిర్వహణ చేపట్టినప్పుడు.. ఇక్కడివారికే ప్రాధాన్యమివ్వాలని ట్రంప్ గట్టిగానే చెబుతున్నారు.అమెరికాలో ఓపెన్ బోర్డర్ పాలసీని ముందుకు తీసుకురావడానికి హారిస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే.. కమలా మాత్రం.. ఈ విషయంలో తాము కఠినంగా ఉంటామంటున్నారు. కానీ డెమొక్రాట్ల విధానాలపై అవగాహన ఉండడంతో… ఈ ప్రకటన వారికి అంతగా ఉపయోగపడేలా కనిపించడం లేదు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ..డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి మిషెల్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తారేమోనని తనకు భయంగా ఉందని అన్నారు.ఇప్పటికే ట్రంప్ పాలనలో నెలకొన్న అస్థిరతను, ఆయన మానసిక పరిస్థితి, దుందుడుకు ఆలోచనలను మనం చూశాం. అయినా ఆయనకు ప్రజలు మద్దతివ్వడం నాలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అదే నిజమవుతుందేమో అని భయమవుతోంది’ అని మిషెల్ అన్నారు. ఈవ్యాఖ్యలు ట్రంప్ కు ఆధిక్యం పెరగడంతో.. డెమొక్రాట్ల శిబిరంలో పెరుగుతున్న భయాలను సూచిస్తోంది.
స్వింగ్ స్టేట్స్
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ ఇండియా తరహాలోనే కొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్లకు, మరికొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్లకు అడ్డాగా చెప్పొచ్చు. ఈ రాష్ట్రాల్లో సాదారణంగా ఆయా పార్టీల ప్రతినిధులు గెలవడం సాంప్రదాయంగా జరుగుతూ వస్తోంది.అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రజలు మార్పు కోరుతూ వస్తున్నారు. కానీ అలా కాకుండా.. ఎటు వైపు మొగ్గచూపకుండా.. గెలుపును ప్రభావితం చేస్తున్న కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈరాష్ట్రాల్లో ఎవరు గెలిస్తే.. వారే దేశాధ్యక్షుడిగా ఎన్నికవుతారు కూడా. ఆరాష్ట్రాలను అమెరికాలో స్వింగ్ స్టేట్స్ అంటారు. ఈ సంవత్సరం ఎన్నికలలో దాదాపు 240 మిలియన్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు, అయితే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తదుపరి అధ్యక్షుడిగా ఎవరు అవుతారో నిర్ణయించే అవకాశం ఉంది.డెమొక్రాట్ కమలా హారిస్ లేదా రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ గెలవగల కొన్ని ‘‘స్వింగ్’’ రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అవి..అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా మరియు విస్కాన్సిన్.
1. అరిజోనా
* ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్.. 11
* స్టేట్ పాపులేషన్ … 7.4 మిలియన్స్..
42020 విజేత బైడన్..10,000 ఓట్లతో గెలుపు
నైరుతి రాష్ట్రమైన అరిజోనా… గత ఎన్నికల్లో డెమొక్రాట్లకు మద్దతుగా నిలిచింది.2020లో గ్రాండ్ కాన్యన్ స్టేట్ మద్దతుతో డెమొక్రాట్లు అధ్యక్ష పదవిని పొందారు, 1990 తర్వాత మొదటిసారిగా పార్టీ అభ్యర్థికి మద్దతునిచ్చేందుకు ఓటు వేసింది.ఈ రాష్ట్రం మెక్సికోకు వందల మైళ్ల సరిహద్దులో ఉంది మరియు దేశం యొక్క ఇమ్మిగ్రేషన్ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. సరిహద్దు చొరబాట్లు పెరిగిపోయాయి.
ఇమ్మిగ్రేషన్‌పై వీం హారిస్ రికార్డుపై ట్రంప్ పదేపదే విమర్శలు చేస్తూ వస్తున్నారు.అమెరికా ఓపెన్ బోర్డర్ విధానాన్ని తెచ్చేందుకు హారిస్ ప్రయత్నిస్తారని ఆరోపించారు ట్రంప్.తాను తిరిగి గెలుపొందినట్లైతే.. ఖూ చరిత్రలో ‘‘అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్’’ చేపడతానని హామీ ఇచ్చారు ట్రంప్..
మరోవైపు.. రిపబ్లికన్లు 160 ఏళ్ల నాటి అబార్షన్ చట్టాలపై పూర్తి నిషేధాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. అరిజోనా కూడా అబార్షన్ యాక్సెస్‌పై తీవ్ర వివాదానికి వేదికైంది.2022 లో ఖూ సుప్రీం కోర్ట్ మహిళలకు అబార్షన్ చేసుకునే రాజ్యాంగ హక్కును కల్పిస్తూ మైలురాయి లాంటి తీర్పిచ్చింది.
2. జార్జియా
* ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్.. 16
* స్టేట్ పాపులేషన్ … 11 మిలియన్స్..
42020 విజేత బైడన్..13,000 ఓట్లతో గెలుపు
నైరుతి రాష్ట్రమైన జార్జియా గత ఎన్నికల్లో బైడన్ కు మద్దతుగా నిలిచింది.జార్జియా జనాభాలో మూడవ వంతు మంది ఆఫ్రికన్-అమెరికన్లు, దేశంలోని నల్లజాతి నివాసితులలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు మరియు 2020లో మిస్టర్ బిడెన్ అధ్యక్ష పదవి సాధనలో ఈ రాష్ట్రం కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు. అయితే గెలిచిన తర్వాత బైడన్ వ్యవహారశైలిపై మాత్రం వీరిలో కాస్త అసంతృప్తి కనిపించిందని చెప్పవచ్చు. కానీ కమలాకు ఆఫ్రో అమెరికన్ కావడంతో.. కాస్త సానుకూలత వ్యక్తమయ్యే అవకాశముందంటున్నారు.
3. మిచిగాన్
* ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్.. 15
* స్టేట్ పాపులేషన్ … 10 మిలియన్స్..
42020 విజేత బైడన్..1,50,000 ఓట్లతో గెలుపు
నైరుతి రాష్ట్రమైన మిచిగాన్… రెండు ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ గ్రేట్ లేక్స్ రాష్ట్రం …2020లో మిస్టర్ బిడెన్‌కు మద్దతు ఇచ్చింది. అయితే..ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు మద్దతు ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందంటున్నారు.
ముఖ్యంగా, మిచిగాన్ దేశంలో అతిపెద్ద అరబ్-అమెరికన్లను కలిగి ఉంది. ప్రెసిడెంట్ బైడన్.. అరబ్ జాతీయలకు సంబంధించి కఠినవైఖరి తీసుకోవడం వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది.అయితే.. బైడన్ తో పోలిస్తే హారిస్.. నెతన్యాహుపై కాస్త కఠినవైఖరి తీసుకోవడంతో.. కాస్త తెరిపినిచ్చే అవకాశముంది.
4. నెవాడా
* ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్.. 6
* స్టేట్ పాపులేషన్ … 3.2 మిలియన్స్..
42020 విజేత బైడన్..34,000 ఓట్లతో గెలుపు
నైరుతి రాష్ట్రమైన నెవాడా.. గత ఎన్నికల్లో డెమొక్రాట్లకు ఓటేసింది. అయితే ఈ సిల్వర్ స్టేట్ లో ఈసారి రిపబ్లికన్లకు అధిక స్థానాలు దక్కే అవకాశాలను తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు… రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న లాటిన్ జనాభా ఓట్లను గెలుచుకోవడానికి పోటీ పడుతున్నారు . మిస్టర్ బిడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి యుఎస్ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని మరియు ఉద్యోగాల సృష్టిని చూపించినప్పటికీ, కోవిడ్ అనంతర పునరుద్ధరణ నెవాడాలో ఇతర ప్రాంతాల కంటే నెమ్మదిగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగిత ఎక్కువగా నమోదైంది.తాను అధికారంలోకి వస్తే తక్కువ పన్నులు,తక్కువ నిబంధనలు అమలు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఫలితంగా కంపెనీల పెట్టుబడులుపెరిగి.. నిరుద్యోగిత తగ్గుతుందన్నారు.
5, ఉత్తర కరోలినా
* ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్.. 16
* స్టేట్ పాపులేషన్ … 10.8 మిలియన్స్..
42020 విజేత ట్రంప్ ..74,000 ఓట్లతో గెలుపు
హారిస్ డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీ పడుతున్న ప్రస్తుత తరుణంలో టార్హీల్ స్టేట్‌లో పోల్స్ కఠినతరం అయినట్లు కనిపిస్తోంది . కొంతమంది విశ్లేషకులు ఇప్పుడు దీనిని ‘‘టాస్-అప్’’ అని పిలుస్తారు.తన మొదటి బహిరంగ ర్యాలీ కోసం ట్రంప్ ఈ స్టేట్ ను ఎంచుకున్నారు కూడా. నార్త్ కరోలినా జార్జియాకు సరిహద్దుగా ఉంది మరియు దాని ఎన్నికల ఆందోళనలలో కొన్నింటిని అలాగే మరొక సన్ బెల్ట్ రాష్ట్రమైన అరిజోనాతో కూడా పంచుకుంటుంది. ట్రంప్ 2020లో నార్త్ కరోలినాను గెల్చుకున్నారు.70,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఇది ఈ ఎన్నికల సంవత్సరంలో ఈ ‘‘పర్పుల్’’ రాష్ట్రం (ఎరుపు లేదా నీలం రంగులో ఓటు వేయగలిగేది) గెలవగలదనే డెమొక్రాట్ల ఆశలను మరింత పెంచింది.
6. పెన్సిల్వేనియా
* ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్.. 19
* స్టేట్ పాపులేషన్ … 13 మిలియన్స్..
42020 విజేత ట్రంప్ ..82,000 ఓట్స్
నైరుతి రాష్ట్రమైన పెన్సిల్వేనియాను గెలుచుకోవడంపై ఇరువురు అభ్యర్థులు ఫోకస్ పెట్టారు.డొనాల్డ్ ట్రంప్ మొదటి హత్యాయత్నం నుండి బయటపడిన కీస్టోన్ రాష్ట్రంలో ఇరుపక్షాలు కూడా తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఒక ప్రధాన సమస్య, అలాగే బిడెన్ పరిపాలనలో ద్రవ్యోల్బణం దేశవ్యాప్తంగా పెరిగింది.ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యవసరాలు ధరలు ంగినంటాయి.ఇది ప్రజల్లో బైడన్ సర్కార్ పై కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతోంది..పెన్సిల్వేనియాలోని బెల్వెదర్ కౌంటీ అయిన ఎరీ ప్రజల్లో.. ఆహార భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.అధిక ద్రవ్యోల్బణం %ఖూ% అంతటా హారిస్‌ను దెబ్బతీస్తుంది, ఎందుకంటే ఇది ఓటర్లకు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల అభిప్రాయాన్ని ఇస్తోందని పోలింగ్ సూచిస్తుంది.
7. విస్కాన్సిన్
* ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్.. 10
* స్టేట్ పాపులేషన్ … 5.9 మిలియన్స్..
42020 విజేత బైడన్ ..21,000 ఓట్స్
నైరుతి రాష్ట్రమైన విస్కాన్సిన్…గత ఎన్నికల్లో బైడన్‌కు మద్దతుగా నిలిచింది. ఇద్దరు అభ్యర్థుల విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న థర్డ్-పార్టీ అభ్యర్థుల ప్రభావం ఇలాంటి ఉపాంత రాష్ట్రాల్లో ఉందని పండితులు సూచించారు . అయితే.. ఈ రాష్ట్రంలో కెన్నెడీ జూనియర్ కు గట్టిమద్దతు ఉంది. కెన్నడీ తన అభ్యర్థిత్వాన్ని వదులుకుని ట్రంప్ కుమద్దతు ప్రకటించారు.ఇక్కడ గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్‌ను బ్యాలెట్ నుండి తొలగించాలని డెమొక్రాట్లు పోరాడుతున్నారు,
సర్వేలు ఏం చెబుతున్నాయి?
స్వింగ్ రాష్ట్రాల్లో హారిస్, ట్రంప్ విజయావకాశాలపై ఇండియన్ ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉందని సర్వేలు అంటున్నాయి. అమెరికాలోదక్షిణాసియాకు చెందిన 48 లక్షల మందిపైగా యువ ఓటర్లను ప్రభావిత చేయడంలో భారతీయులు కీలకంగా మారినట్లు వెల్లడించాయి. గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేసినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2020 ఎన్నికల్లో 71 శాతం ఇండో అమెరిన్లు ఓటేసినట్లు చెప్పాయి. ఈ సారి 91 శాతం మంది ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వే అంచనా వేసింది.
భారీ స్థాయిలో విరాళాలు
అమెరికాలో ప్రధాన పార్టీలకు భారతీయ అమెరికన్ల నుంచి పెద్ద మ్నెత్తంలో విరాళాలు వెలుతున్నాయి. అక్కడ భారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లుగా ఉంది. ఇది అమెరికన్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ మ్నెత్తంలో మన వారినుంచే వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు ఉన్నారు. అక్కడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు, సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్న, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న భారతీయ మూలాల ఉన్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు.
ఇండియన్ అమెరికన్ల మద్దతు ఎవరికి?
భారతీయ అమెరికన్లలో దాదాపు 55 శాతం మంది డెమోక్రటిక్ పార్టీ మద్దతిస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడిరచాయి. 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చారు. 15 శాతం మంది స్వతంత్రులకు మద్దతివ్వగా, మిగిలిన వారు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు విముఖత చూపినట్లు సర్వేలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో ట్రంప్, కమలా హ్యారిసే కాదు.. వేరే పార్టీలకు చెందినవారు, స్వతంత్రులు కూడా ఉన్నారు. గ్రీన్పార్టీకి చెందిన జిల్ స్టీన్, లిబర్టేరియన్ పార్టీకి చెందిన చేజ్ఒలివర్ వంటివారు కూడా ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ తమ్ముడి కుమారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. కానీ, ఆ తర్వాత ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.
భారతీయ అమెరికన్ల ఓట్లే కీలకం!
అమెరికాలో నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. అక్కడి దేశ రాజకీయాల్లో భారతీయ మూలాలు ఉన్నవారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఓటర్లుగానే కాకుండా రాజకీయ నేతలుగా, అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకరించే వారిగా ఇలా అనేక అంశాల్లో భారతీయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అమెరికా మ్నెత్తం ఓటర్లలో భారతీయ అమెరికన్ల ఓట్లు దాదాపు 21 లక్షలు ఉంటాయి. సంఖ్యా పరంగా చూస్తే తక్కువే అయినా వీరి ప్రభావం నానాటికీ పెరుగుతుండడంతో వీరిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకే రెండు ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు భారతీయ అమెరికన్లను విస్మరించే పరిస్థితి లేదు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కూడా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది విద్యాధికులే ఉన్నారు.
అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యమున్న స్వింగ్ రాష్ట్రాల్లో భారతీయుల జనాభా ఎక్కువగా ఉంది. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే పెన్సిల్వేనియా, ఆరిజోనా, నెవాడా, జార్జియా, మిషిగన్, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లు అత్యధికంగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో అత్యంత కీలకమైనపెన్సిల్వేనియా రాష్ట్రంలోని బక్స్ కౌంటీలో భారతీయలు అధిక సంఖ్యలో ఉన్నారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోనూ భారతీయ సంతతి అధికంగా ఉంది. దీంతో వీరి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ కీలకంగా మారనుంది.
అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ప్రభావం..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు తీవ్ర ప్రభావం చూపనున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులదే రెండో స్థానం. ఈ ఏడాది ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. సంఖ్య పరంగా చూస్తే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, నానాటికీ భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతుండడం వల్ల వారిని విస్మరించే పరిస్థితి లేదు. అందుకే రెండు ప్రధాన పార్టీలు వీరి ఓట్లను దక్కించుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నాయి.






