అమెరికాలో 350 ఏళ్ల అయినా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా
అమెరికాలోనూ రాజకీయంగా లింగ వివక్ష కొనసాగుతోంది. ఓటర్లలో పురుషులు ఎక్కువమంది ట్రంప్ వైపు మొగ్గుచూపుతుండగా, మహిళలు కమలా హారిస్‌కు మద్దతిస్తున్నారని సర్వేల ద్వారా వెల్లడైంది. అమెరికా స్వాతంత్య్రం వచ్చి సుమారు 350 ఏళ్లు కాగా ఇప్పటి వరకు అధినేతగా ఒక్కసారి కూడా మహిళ గెలవకపోవడం అక్కడి పురుషాధిక్య సమాజానికి అద్దం పడుతోంది. ఎనిమిదేళ్ల క్రితం తొలిసారి అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్ నిలవగా, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఓడిరచారు. ఇప్పుడు మరో మహిళ కమలా హారిస్‌తో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అయితే ఓటింగ్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పాల్గొంటున్నందున ఈసారి ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.






