స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జో బైడెన్
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారత్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందని ప్రశంసించారు. 1947, ఆగస్టు 15న మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశం సత్యం, అహింస అనే మార్గ నిర్దేశాల ద్వారా సుధీర్ఘ ప్రయాణంతో భారత్ స్వాతంత్య్రాన్ని సాధించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల ఇష్టాలను గౌరవించడమనే నిబద్ధత ప్రపంచానికి స్ఫూర్తినిస్తోందని అన్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక బంధానికి ఆధారమని అధ్యక్షుడు బైడెన్ అన్నారు.






