రష్యాపై అమెరికా ఆంక్షలు…
రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ చట్టాన్ని రష్యా స్పష్టంగా ఉల్లంఘించినందుకుగాను ఆయన ఈ ఆంక్షలు విధించారు. వైట్‌హౌస్ నుంచి ఆయన ప్రసంగిస్తూ ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా కాలుదువ్వుతుండడంతో అమెరికా తొలి విడత ఆంక్షలను ప్రకటించింది. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు, రష్యా సార్వభౌమాధికారం, రష్యా, ఉన్నతవర్గాలు, వారి కుటుంబ సభ్యులపై ఈ ఆంక్షలు ప్రకటించారు. అమెరికా చర్యలు పాశ్చాత్య దేశాల నుంచి రష్యా ప్రభుత్వానికి ఆర్థిక మద్దతు అందకూడా చేస్తుంది అని బైడెన్ తెలిపారు. నాటో తూర్పు పార్శ్వంలోని అమెరికా మిత్రదేశాలైన బాల్టిక్ దేశాలను బలోపేతం చేయడానికి అదనపు బలగాలు, పరికరాలను పంపుతున్నట్లు కూడా ప్రకటించారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రత్యేక ప్రాంతాలైన లుహాన్క్స్, డొనేత్సక్లోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బలగాలను పంపారు. ఇది స్పష్టంగా అంతర్జాతీయ చట్టం ఉల్లంఘనే అని బైడెన్ అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాలలోని ప్రదేశాలలో కొత్త దేశాలను ప్రకటించే హక్కును పుతిన్‌కు ఎవరిచ్చారు? అని కూడా బైడెన్ ప్రశ్నించారు.






