ఇంతకంటే మంచి రోజు ఇంకోటి లేదు : జో బైడెన్
అమెరికా చరిత్రలోనే మగ్‌షాట్ తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. దీంతో అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్ మగ్‌షాట్ ఫొటోపై సెటైర్ వేశారు. తాహోలోని వ్యాయామ క్లాస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రంప్ నిజంగా అందమైన, అద్భుతమైన వ్యక్తి అని బైడెన్ సెటైర్ వేశారు. అయితే ట్రంప్ జార్జియాలోని పుల్టన్ కౌంటీ జైల్లో ఉన్న సమయంలో బైడెన్ నిధుల సేకరణకు సంబంధించి ఈ మెయిల్స్‌ను తన మద్దతుదారులకు పంపించారు. మనం ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు ఇంతకంటే మంచి రోజు ఇంకోటి లేదు అంటూ బైడెన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.






