బలగాల తరలింపుకు గడువు లేదు.. 31 తర్వాత కూడా
ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల తరలింపు గడువుపై అగ్రరాజ్యం అమెరికా సృష్టతనిచ్చింది. పౌరులతో పాటు ఆప్ఘన్ వాసుల తరలింపునకు గడువేమీ లేదని చెప్పింది. ఈ నెల 31 తర్వాత కూడా తరలింపు కొనసాగుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘన్లో ఇంకా 1500 మంది అమెరికన్లు తరలింపు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటి వరకు దాదాపు ఆరువేల మందిని అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయలుదేరారన్నారు. ఇందులో దాదాపు 4,500 మందిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. చివరి రోజున అమెరికా మరో 500 మంది పౌరులను సంప్రదించిందని విమానాశ్రయానికి ఎలా చేరుకోవాలో వారికి చెప్పినట్లు తెలిపారు.
మరో వెయ్యి మంది అమెరికన్లను సైతం సంప్రదిస్తున్నామని, కాన్సులర్ సిబ్బంది అనేకసార్లు ఫోన్లు, మెసేజ్లు, ఈమేయిల్స్ ద్వారా వారిని సంప్రదిస్తున్నట్లు తెలిపారు. అయితే తరలింపు పక్రియ ఈ నెల 31తో ముగియదని తెలిపారు. ఆప్ఘన్ నుంచి బయపడే వ్యక్తులను తీసుకువచ్చేందుకు అవసరమైన సహాయం అందించేంత వరకు కొనసాగుతుందని చెప్పారు.






