తాలిబన్ ప్రభుత్వం పై అమెరికా ఆందోళన
తాలిబన్లు ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వంపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధానిని చేశారని, అమెరికా ప్రకటించిన తీవ్రవాద జాబితాలోని మరో వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని పేర్కొంది. కొత్త ప్రభుత్వ జాబితాలో తమ ప్రత్యర్థులకు ఎలాంటి సయోధ్య ప్రతిపాదనలు లేదా సూచనలు కనిపించలేదు. 1990 వ దశకంలో తాలిబన్ల పాలనలో సీనియర్ మంత్రిగా ఉన్న ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ తాత్కాలిక ప్రధాని వుండగా, గ్రూపు సహ వ్యవస్థాపకుడు, అమెరికా ఉపసంహరణ ఒప్పంద పర్యవేక్షకుడు బరాదర్ డిప్యూటీ ప్రధానిగా వున్నారు. కీలకమైన హోంమంత్రి పదవికి హక్కాని నెట్వర్క్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సిరాజుద్దీన్ హక్కాని నియమితులయ్యారు.






